ప్రకృతి ప్రకోపం.. ప్రభుత్వ నిర్లక్ష్యం.. వెరసీ అన్నదాతలకు శాపంగా మారుతోంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను సకాలంలో కొనుగోలు చేయకపోవడంతో మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం.. అకస్మాత్తుగా కురిసిన అకాల వర్షానికి నీటిపాలైంది. నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో విక్రయానికి తీసుకువచ్చిన మొక్కజొన్న ఆదివారం కురిసిన అకాల వర్షానికి తడిసిపోయింది. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్న వర్షపు నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన మొక్కజొన్న పంటను ప్రభుత్వం త్వరగా కొనుగోలు చేయకపోవడంతో ఈ దుస్థితి దాపురించిందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
– నాగర్‌కర్నూల్ క్రైం


