‘భూమికి భూమి ఇవ్వాలి’ | - | Sakshi
Sakshi News home page

‘భూమికి భూమి ఇవ్వాలి’

May 6 2026 7:49 AM | Updated on May 6 2026 7:49 AM

కోస్గి రూరల్‌: నారాయణపేట–రేడియల్‌ రోడ్‌ నిర్మాణానికి ప్రభుత్వం చేపడుతున్న భూ సేకరణలో భూమికి బదులుగా భూమి ఇవ్వాలని పలువురు రైతులు ఆర్డీఓ రాజేందర్‌గౌడ్‌ను కోరారు. మంగళవారం మండలంలోని నాచారం, తోగాపూర్‌లో భూ సేకరణ గ్రామసభలు నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. నాచారం గ్రామంలో 70 మంది రైతులకు చెందిన 26 ఎకరాలు, తోగాపూర్‌లో 150 మంది రైతులకు చెందిన 67 ఎకరాలు రోడ్డు నిర్మాణంలో కోల్పోతున్నారు. ఇందులో పలువురు రైతులు ఉన్న కాస్త భూమి కోల్పోతున్నామని.. భూమికి బదులుగా భూమి ఇవ్వాలని ఆర్డీఓను కోరారు. స్పందించిన ఆయన అలా ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పారు. రైతుల వినతులు, నష్ట పరిహారం వివరాలను కలెక్టర్‌కు నివేదిస్తామని తెలిపారు. త్వరలో కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి రైతులను పిలుస్తామని.. మరోసారి చర్చించవచ్చని వివరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ వార్ల విజయ్‌కుమార్‌, ఆర్‌ఐ సుభాష్‌, ఉప తహసీల్దార్‌ బాలరాజు, సర్వేయర్‌ అరుణ, సర్పంచ్‌లు రేణుక, శ్రీనివాస్‌, గ్రామస్తులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement