ఇందన ఇక్కట్లు.. | - | Sakshi
Sakshi News home page

ఇందన ఇక్కట్లు..

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

ఇందన ఇక్కట్లు..

ధన్వాడలో బారులు తీరిన వాహనాలు

బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ కొరత తలెత్తడంతో మంగళవారం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరి కోతలు ఉపందుకోవడంతో వరి కోత యంత్రాల నిర్వాహకులు డీజిల్‌ కోసం బైక్‌లపై డబ్బాలతో మక్తల్‌, దేవరకద్ర, మరికల్‌ జాతీయ రహదారిపై ఉన్న బంకుల చుట్టూ చక్కర్లు కొట్టడం కనిపించింది. ఎక్కడికి వెళ్లినా నో–స్టాక్‌ బోర్డులు కనిపించాయి. మరికల్‌లో ఐదు బంకులు ఉండగా.. నాలుగింటిలో నో–స్టాక్‌ బోర్డులు పెట్టారు. ధన్వాడలోని పెట్రోల్‌ బంక్‌లో మూడురోజులుగా విక్రయాలు నిలిచిపోయాయి. మంగళవారం తెల్లవారుజామున మరికల్‌లోని ఒక బంకుకు, ధన్వాడలోని బంక్‌కు డీజిల్‌ ట్యాంకర్‌ రావడంతో పౌరసరఫరాలశాఖ అధికారుల సూచన మేరకు బంకు నిర్వాహకులు వరికోత యంత్రాల పత్రాలను పరిశీలించి డీజిల్‌ పోశారు. గంటల తరబడి వేచి చూసి డీజిల్‌ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క కిలోమీటర్ల మేర వాహనాలు డీజిల్‌ కోసం బారులు తీరాయి. – మరికల్‌, ధన్వాడ

మరికల్‌లో డీజిల్‌ కోసం వరుసలో పెట్టిన డబ్బాలు

Advertisement
 
Advertisement
Advertisement