నారాయణపేటఎడ్యుకేషన్/కోస్గి రూరల్:జిల్లాలో బు ధవారం జరిగిన పాలిసెట్ (పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ప్రశాంత వాతావరణంలో ముగిసిందని కో–ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు తెలిపారు. నా రాయణపేటలో 3, కోస్గిలో 2 పరీక్ష కేంద్రాలు ఏర్పా టు చేశామని..మొత్తం 1,330 మంది విద్యార్థులకుగా ను 1, 225 మంది విద్యార్ధులు పరీక్ష రాయగా, 105 మంది గైర్హాజరైనట్లు వివరించారు. మొత్తంగా 92.08 శాతం హాజరు నమోదైందని చెప్పారు. కోస్గిలోని ప్ర భుత్వ ఇంజినీరింగ్ కళాశాల పరీక్ష కేంద్రంలో 300 మంది విద్యార్థులకుగాను 285 మంది, ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 173 మందికిగాను 159 మంది హాజరయ్యారని చెప్పారు. అలాగే జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికిగాను 223 మంది, బ్రిలియంట్ స్కూల్ కేంద్రంలో 217 మందికిగాను 199 మంది, చిట్టెం నర్సిరెడ్డి స్మారక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 400 మందికిగా ను 374 మంది విద్యార్థులు పరీక్ష రాసినట్లు వివరించారు.


