నారాయణపేట: జనగణనను విజయవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం కృషి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక ఆదేశించారు. జనగణన–2027కు సంబంధించి నిర్వహిస్తున్న స్వీయ గణన, ఇతర అంశాలపై శుక్రవారం హైదరాబాద్ నుంచి డైరెక్టర్ ఆఫ్ సెన్సెస్ భారతి హోళికేరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్ నిర్వహించి సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొని వివరాలు వెల్లడించారు. జిల్లాలోని ఒక్కో గ్రామపంచాయతీ కార్యదర్శికి 100 మంది స్వీయ గణనలో పాల్గొనేలా లక్ష్యాన్ని నిర్దేశించినట్లు చెప్పారు. వీసీ అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమయ్యారు. చార్జ్ అధికారులు జనగణనకు సంబంధించి సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్లతో శనివారం సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేయాలన్నారు. ఎన్యూమరేటర్లకు గణనకు అవసరమైన కిట్లు, గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. సెన్సెస్‌కు సంబంధించిన హ్యాండ్‌బుక్స్‌ను క్షుణ్ణంగా చదివి ఎలాంటి తప్పిదాలకు అవకాశం లేకుండా గణన చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, సీపీఓ ఖాఘావాహన్, ఏఓ శ్రీధర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సీహెచ్ ప్రియాంక


