పది తప్పిన వారికి తర్ఫీదు | - | Sakshi
Sakshi News home page

పది తప్పిన వారికి తర్ఫీదు

May 14 2026 1:07 AM | Updated on May 14 2026 1:07 AM

నేడు ఆఖరు..

–8లో u

నారాయణపేట రూరల్‌: ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గతేడాది కంటే మెరుగుపడింది. అధికారుల ప్రత్యేక దృష్టి కారణంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. ఇదే ఉత్సాహంతో ఫెయి ల్‌ అయిన విద్యార్థులను సప్లిమెంటరీ పరీక్షల్లో గట్టెక్కించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో విద్యాశాఖ ప్రత్యేక తరగతులు నిర్వహిస్తోంది. జూన్‌ 5 నుంచి 12వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సమయసారణి విడుదచేసింది. అందుకు అనుగు ణంగా ఈ నెల 12 నుంచి జూన్‌ 3 వరకు రోజు సబ్జె క్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వేసవి నేపథ్యంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు తరగతులు కొనసాగుతున్నాయి.

జిల్లాలో ఇలా..

జిల్లావ్యాప్తంగా 8,319 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయగా.. 8,138 మంది ఉత్తీర్ణులయ్యారు. 181 మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. వీరిలో చాలామంది ఒక్కో సబ్జెక్టులోనే తప్పినట్లు అధికారులు చెబుతున్నారు. అత్యధికంగా సైన్స్‌లో 84 మంది, అదేవిధంగా ఇంగ్లిష్‌లో 69 మంది, తెలుగులో 62 మంది, గణితంలో 61 మంది, సాంఘికశాస్త్రంలో 20 మంది, హిందీలో 15 మంది మాత్రమే ఉత్తీర్ణులు కాలేకపోయారు.

● సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడానికి జిల్లాలోని నాలుగు ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు కొనసాగుతున్నాయి. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ గ్రౌండ్‌ స్కూల్‌, మరికల్‌, మక్తల్‌, గుండుమల్‌ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తరగతులు కొనసాగుతున్నాయి. ఫెయిల్‌ ఆయన విద్యార్థులు సమీపంలోని కేంద్రాలకు రావాల్సి ఉంటుంది. ఫెయిల్‌ అయిన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో ఎక్కువ కేంద్రాలు ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. రోజు ఉదయం 8 వరకు కేంద్రాలకు చేరుకోవడం కష్టంగా ఉందని దూర ప్రాంత విద్యార్థులు చెబుతున్నారు.

ప్రత్యేక నిధులు మంజూరు..

ప్రత్యేక తరగతుల నిర్వహణకు ప్రభుత్వం నిధులు విడుదల చేయనుంది. అవసరమైన స్టేషనరీ, అల్పాహారం, రవాణాతో పాటు ఇతర ఖర్చులకు ప్రతి విద్యార్థికి రూ.1,100 చొప్పున వినియోగించాలని సూచించింది. ఈ ప్రకారం జిల్లాకు 181 మంది విద్యార్థులకుగాను రూ.99,100 రానున్నాయి. చెల్లింపులు నగదు రూపంలో కాకుండా ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదేవిధంగా కేంద్రంలో విద్యార్థులకు అవసరమైన తాగునీరు, మరుగుదొడ్లు, గదుల్లో ఫ్యాన్లు ఏర్పాటు చేశారు.

మండలాల వారీగా ఫెయిలైన విద్యార్థులు..

మక్తల్‌ 37, మరికల్‌37, మద్దూరు, 35, కోస్గి 29, నారాయణపేట18, ధన్వాడ 9, ఉట్కూరు 5,

దామరగిద్ద 5, మాగనూర్‌ 3, కృష్ణా 2.

పదోతరగతి పరీక్షల్లో తక్కువ మార్కులు, ఫెయిల్‌ అయిన విద్యార్థులు జవాబు పత్నాల పునః పరిశీలనకు విద్యాశాఖ అవకాశం కల్పించింది. మార్కుల లెక్కింపుతో పాటు సమాధాన పత్రాలు పొందడానికి గురువారం వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. రూ.500 చెల్లిస్తే రీ కౌంటింగ్‌.. రూ.వెయ్యి చెల్లిస్తే రీ వెరిఫికేషన్‌ చేస్తారు. వీటిని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత పత్రాలు, జవాబు పత్రాలు విద్యార్థి సెల్‌ఫోన్‌కు పంపిస్తారు.

ఫెయిలైనవిద్యార్థులపై ప్రత్యేక దృష్టి

జూన్‌ 3 వరకు

ప్రత్యేక తరగతుల నిర్వహణ

జిల్లాలోని నాలుగు పాఠశాలల్లో..

పర్యవేక్షిస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement