ప్రతి నెల జమచేయాలి.. | - | Sakshi
Sakshi News home page

ప్రతి నెల జమచేయాలి..

May 6 2026 7:49 AM | Updated on May 6 2026 7:49 AM

ప్రతి నెల జమచేయాలి.. 12 నెలలుగా చెల్లించడం లేదు.. ప్రభుత్వం నుంచి నిధులోస్తే..

ప్రతి నెల క్రమం తప్పకుండా పొదుపునకు సంబంధించి మూల వేతనంలో 8 శాతం డబ్బును బ్యాంకులో జమ చేస్తు న్నాం. కాని ప్రభు త్వం కేవలం రెండు నెలలకు సంబంధించిన డబ్బులు 16 శాతం ని ధులు మాత్రమే జమ చేసింది. ప్రభుత్వం ప్రతి నెల త్రిఫ్ట్‌ ఫండ్‌ వాటాధనాన్ని ఆర్‌డీ–2 ఖాతాలో జమచేయాలి. బకాయి ఉన్న 12 నెలల డబ్బులు వెంటనే చెల్లించాలి.

– ఎంకంపల్లి శ్రీనివాసులు, నేత కార్మికుడు, అమరచింత

నేత కార్మికుడు రూ. 1,200 అనుబంధ కార్మికుడు రూ. 800 చొప్పున ప్రతి నెల ఆర్‌డీ–1లో ఖాతాలో 14 నెలలుగా జమ చేస్తున్నారు. ప్రభు త్వం వీటికి సంబంధించిన ఇప్పటి వరకు కేవలం 2 నెలలకు సరిపడా నిధులు మాత్రమే జమ చేసింది. మిగిలిన నెలల డబ్బులు వెంటనే విడుదల చేసి నేత కార్మికులను ఆదుకోవాలి. లేనిపక్షంలో ఏడీ కార్యాల యం ఎదుట ఆందోళన చేపడతాం.

– వగ్గు రామలింగం, నాయకుడు,

చేనేత కార్మిక సంఘం, అమరచింత

నేతన్నకు పొదుపు పథకానికి సంబంధించి కేవలం రెండు నెలలకు సరి పడా నిధులు మా త్రమే మంజూరయ్యా యి. మిగిలిన నెలల డబ్బులు మంజూరు చేయలేదు. నేతన్నలు జమ చేస్తున్న డబ్బుకు 16 శాతం ప్రభుత్వ వాటా గా చెల్లించాల్సి ఉంది. నిధులు మంజూరైన వెంటేనే ఆర్‌డీ–2 ఖాతాలో జమచేస్తాం.

– పద్మ, డిప్యూటీ డైరెక్టర్‌,

చేనేత, జౌళిశాఖ, గద్వాల

Advertisement
 
Advertisement
Advertisement