పదేళ్లుకు పైగా చాలీచాలని వేతనంతో పనిచేస్తున్నాం. జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పర్యవేక్షణ చేపడుతున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగా రాష్ట్రంలోనూ పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఖాళీగా ఉన్న సీఆర్పీల పోస్టులను భర్తీ చేసి పని భారం తగ్గించాలి. ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించి ఆదుకోవాలి.
– ఆరీఫ్ అహ్మద్, సీఆర్పీ, నారాయణపేట
సీఆర్పీలను క్రమబద్ధీకరించాలి..
ఏళ్లుగా పనిచేస్తున్న ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరిస్తూ వారిని క్రమబద్ధీకరించాలి. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేస్తామని గత ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినా అలాగే కొనసాగించడం సరికాదు. సీఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ పనికి తగిన వేతనం చెల్లించాలి.
– శేర్ కృష్ణారెడ్డి, రాష్ట్ర అదనపు కార్యదర్శి, తపస్, నారాయణపేట
●


