మాగనూర్: ఇసుక అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని రెవెన్యూ అధనపు కలెక్టర్ శ్రీను హెచ్చరించారు. బుధవారం ఆయన మండలంలోని వర్కూర్, మాగనూర్, దాసర్‌పల్లి ఇసుక రీచ్‌లను తనిఖీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరిపితే చర్యలు తీసు కుంటామన్నారు. అనుమతి పొందిన పరిధిలోనే మాన్యువల్‌గా తవ్వకాలు జరిగేలా మైనింగ్ అధి కారులతో పాటు పోలీసు, రెవెన్యూ, సాండ్ కమి టీ, ఇతర శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరిగినట్లు గుర్తిస్తే పోలీసులు కేసునమోదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఆయన వెంట మాగనూర్ ఇన్‌చార్జ్ తహసీల్దార్ పుష్పలతరెడ్డి, ఆర్‌ఐ బాలరాజు, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.


