మాది మధ్య తరగతి కుటుంబం. నా జీవితం ఎదుగుదలలో మా అమ్మ పాత్ర ఎంతో ఉంది. మా నాన్న సాయిబాబ, అమ్మ వెంటకసుబ్బమ్మ. మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను రెండో సంతానం. మిగిలిన ఇద్దరిలో ఒకరు టీచర్ కాగా.. మరో సోదరుడు మున్సిపల్ ఆఫీసులో మేనేజర్‌గా పనిచేస్తున్నారు. ముందు నుంచి మా అమ్మ మమ్మల్ని బాగా చదువుకోవాలని ప్రోత్సహించేవారు. బాగా చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని చెబుతూ ఉండేది. ఈ క్రమంలోనే నేను గ్రూప్–1 సాధించాను. ఆ తర్వాత 2013లో ఐపీఎస్ కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం నేను ఈ స్థాయిలో ఉన్నాను అంటే అది మా అమ్మ వల్లే.
– టి.శ్రీనివాసరావు, ఎస్పీ, జోగుళాంబ గద్వాల


