ఫలితాలు సంతృప్తినిచ్చాయి..
–8లో u
నారాయణపేట రూరల్: పదోతరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో బాలుర కంటే ఒక శాతం అధిక ఉత్తీర్ణత సాధించి బాలికలు పైచేయిగా నిలిచారు. ఐదేళ్లుగా పరిశీలిస్తే బాలుర కంటే బాలికలే అధికంగా ఉత్తీర్ణులవుతున్నారు. జిల్లా ఏర్పాటైన తొలి రెండేళ్లు కరోనాలో పోగా ఐదుసార్లు టెన్త్ పరీక్షలు జరిగాయి. 2022లో 80 శాతం ఉత్తీర్ణతతో 26వ స్థానంలో నిల వగా.. 2023లో 75 శాతం పాస్ పర్సెంటేజ్‌తో 31, 2024లో 93 శాతం ఉత్తీర్ణతతో 15వ స్థానం, 2025 లో ఉత్తీర్ణత శాతం 95.18కి పెరిగి 19వ స్థానం, ఈసారి మాత్రం ఏకంగా 97.82 శాతం ఉత్తీర్ణతతో ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని 14వ స్థానం సాధించింది.
8,125 మంది విద్యార్థులు పాస్..
జిల్లావ్యాప్తంగా 8,306 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయగా.. 8,125 మంది ఉత్తీ ర్ణులు కావడంతో 97.82 శాతం నమోదైంది. బాలురు 3,971 మందికిగాను 3,860 మంది పాస్ కావడంతో 97.2 శాతం, బాలికలు 4,335 మందికిగాను 4,265 మంది పాస్ కావడంతో 98.34 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అదేవిధంగా ఉత్తమ మార్కు ల సాధనలో సైతం 80 శాతం పాఠశాలల్లో బాలిక లో టాపర్లుగా నిలిచారు. జిల్లాలో టాప్ టెన్‌లోనూ అందరు అమ్మాయిలు ఉండటం విశేషం.
జిల్లాలో మొత్తం 146 ఉన్నత పాఠశాలలు ఉండగా.. 74 పాఠశాలల్లో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో 27 ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్ పాఠశాలలు, 6 కేజీబీవీలు, 6 సోషల్ వెల్ఫేర్, ఒక ట్రైబల్, ఒక మైనార్టీ, ఒక బీసీ వెల్ఫేర్ పాఠశాలతో పాటు 32 ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. జీరో ఉత్తీర్ణత శాతం పాఠశాలలు ఒక్కటి కూడా లేకపోవడం విశేషం.
పదోతరగతి పరీక్ష ఫలితాల్లో 97 శాతం ఉత్తీర్ణత సాధించడం ఎంతో సంతృప్తి కలిగిస్తోంది. బాలికలు అత్యధికంగా ఉత్తీర్ణులు కావడం ఆనందంగా ఉంది. ఫెయిల్, గైర్హాజరైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉంది. ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరుకావాలి. గతంలో కంటే అధికంగా ఉత్తీర్ణత శాతం సాధించడంతో పాటు అత్యధికంగా 500పైగా మార్కులు సాధించడం, జిల్లాలో సగానికి పైగా వందశాతం ఉత్తీర్ణత సాధించడం ఆనందం కలిగించింది. ఇందుకు కృషిచేసిన ఉపాధ్యాయులకు అభినందనలు. వచ్చే ఏడాది మెరుగైన ఫలితాల సాధనకు కృషిచేస్తాం.
– డా. గోవిందరాజు,
జిల్లా విద్యాధికారి
‘పది’ ఫలితాల్లో 97.82 శాతం ఉత్తీర్ణత
74 పాఠశాలల్లో
వందశాతం విద్యార్థులు పాస్
రాష్ట్రస్థాయిలో
14వ స్థానంలో నిలిచిన జిల్లా


