‘రామన్‌పాడు’ తగ్గుముఖం | - | Sakshi
Sakshi News home page

‘రామన్‌పాడు’ తగ్గుముఖం

May 7 2026 9:26 AM | Updated on May 7 2026 9:26 AM

వైద్యశాఖలో అలజడి

రిజర్వాయర్‌లో ఏడు మీటర్లుతగ్గిన నీటిమట్టం

ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మిషన్‌ భగీరథ అధికారులు

ఆత్మకూర్‌: ఉమ్మడి జిల్లాలో ప్రజల తాగునీటి అవసరాలు తీరుస్తున్న రామన్‌పాడు రిజర్వాయర్‌లో రోజురోజుకు నీటిమట్టం తగ్గుముఖం పడుతోంది. ఇప్పటివరకు ఏడు మీటర్ల మేర నీటిమట్టం తగ్గింది. ఒకవేళ రిజర్వాయర్‌లో నీటిమట్టం పూర్తిగా తగ్గితే పాలమూరులోని అనేక గ్రామాలు తాగునీటి ఎద్దడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొననుంది. ప్రధానంగా మిషన్‌ భగీరథ పథకం ద్వారా నిత్యం వనపర్తి జిల్లాలోని 6.46 లక్షల మందికి 7.66 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. వేసవి నేపథ్యంలో మే, జూన్‌ నెలల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటూ బోరుబావులు, చేతిపంపులు, ట్యాంకర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు అనుసంధానంగా రామన్‌పాడు రిజర్వాయర్‌ను నిర్మించారు. రిజర్వాయర్‌లోని నీటితో పాటు జూరాల ప్రధాన, సమాంతర కాల్వ ద్వారా నిత్యం తాగు, సాగునీటి సరఫరా కొనసాగుతోంది. గతంలో రామన్‌పాడు రిజర్వాయర్‌ నుంచి ఉమ్మడి జిల్లాలోని 500 గ్రామాలకు 30 ఎంఎల్‌డీ నీటిని సరఫరా చేస్తుండేవారు. ప్రస్తుతం శ్రీశైలం వెనుక జలాల నుంచి పలు పథకాలకు తాగునీరు సరఫరా అవుతుండటంతో రామన్‌పాడుపై భారం తగ్గింది. ప్రస్తుతం రెండు పథకాలకు 10.4 ఎంఎల్‌డీ నీటిని వినియోగిస్తున్నారు. రిజర్వాయర్‌లో 1022.06 అడుగుల నీటిమట్టం ఉండాల్సి ఉండగా.. బుధవారం 1020.09 అడుగులకు చేరింది.

తాగునీటి పథకాలు..

శ్రీశైలం వెనుక జలాల నుంచి నాగర్‌కర్నూల్‌ జిల్లా గౌరిదేవిపల్లి 77 ఎంఎల్‌డీ తాగునీటి పథకం ద్వారా వనపర్తి జిల్లాలోని 8 గ్రామాలకు నీరు సరఫరా చేస్తున్నారు. అలాగే గోపాల్‌పేట 10 ఎంఎల్‌డీ పథకం ద్వారా 44 గ్రామాలు, బుగ్గపల్లి 75 ఎంఎల్‌డీ పథకం ద్వారా 87 గ్రామాలు, పాన్‌గల్‌ 5 ఎంఎల్‌డీ పథకం ద్వారా 19 గ్రామాలు, వీపనగండ్ల 4 ఎంఎల్‌డీ పథకం ద్వారా 20 గ్రామాలు, ఆత్మకూర్‌ 2.4 పథకం ద్వారా 12 గ్రామాలు, నందిమళ్ల సత్యసాయి 2 ఎంఎల్‌డీ పథకం ద్వారా 12 గ్రామాలు, కొల్లాపూర్‌ 31 ఎంఎల్‌డీ పథకం ద్వారా 58 గ్రామాలకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పురపాలికలకు 27.6 ఎంఎల్‌డీ, గ్రామాలకు 48.435 ఎంఎల్‌డీ నీటిని అందిస్తున్నారు.

వనపర్తి: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో గందరగోళం సృష్టించిన ఉద్యోగుల నకిలీ ధ్రువపత్రాల వ్యవహారం చిలికి చిలికి గాలివానలా మారుతుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. నకిలీ విద్యార్హత ధ్రువపత్రాలతో కాంట్రాక్టు ఉద్యోగాలు పొందారంటూ తరుచూ కలెక్టరేట్‌ ప్రజావాణికి ఫిర్యాదులు అందడంతో కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టిన అధికారులు ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు నకిలీ ధ్రువపత్రాలతో కొన్ని నెలలుగా ఉద్యోగం చేస్తూ ప్రభుత్వాన్ని మోసం చేశారని, విధుల నుంచి తొలగిస్తున్నట్లు డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. కష్టపడి చదివి తెచ్చుకున్న విద్యార్హతను నకిలీగా చిత్రీకరించి ఉద్దేశపూర్వకంగా తన పరువుకు భంగం కలిగించారంటూ వారిలో ఒకరైన శిరీష డీఎంహెచ్‌ఓపై రూ.50 లక్షలకు పరువు నష్టం దావా వేశారు. ఇటీవల వనపర్తి కోర్టు ఈ దావాను స్వీకరించినట్లు తెలిసింది. 2026, జూన్‌ 12న కోర్టుకు హాజరుకావాలని తెలిపినట్లు సమాచారం. నకిలీ ధ్రువపత్రాలతో ఉద్యోగం పొంది ఉంటే తీసుకున్న వేతన రికవరీకి ఎందుకు ఉపక్రమించలేదని, యూనివర్సిటీ డిక్లరేషన్‌ కాపీ ఎందుకు బయటపెట్టడం లేదనే అంశాలు వైద్య, ఆరోగ్యశాఖలో సర్వత్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్‌ఓ డా. సాయినాథ్‌రెడ్డి వద్ద ప్రస్తావించగా.. అదంతా గడిచిపోయిన విషయమని, చట్టప్రకారం వెళ్తున్నామని, ఎక్కువగా మాట్లాడటం సరికాదని బదులిచ్చారు.

సాగునీటి సరఫరా బంద్‌..

ఇదిలా ఉండగా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ కాల్వ ద్వారా నిత్యం 350 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేస్తుండేవారు. ప్రాజెక్టులో నీటిమట్టం తగ్గిపోవడంతో ఉన్న నీటిని ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు కేవలం తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగిస్తున్నట్లు పీజేపీ అధికారులు తెలిపారు. పీజేపీ, మిషన్‌ భగీరథ అధికారులు సమన్వయంతో ముందుకెళ్తే తాగునీటి కష్టాలు తలెత్తవు.

Advertisement
 
Advertisement
Advertisement