జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌

Apr 29 2026 7:24 AM | Updated on Apr 29 2026 7:24 AM

నారాయణపేట: కలెక్టర్‌గా సోమవారం బాధ్య తలు చేపట్టిన సీహెచ్‌ ప్రియాంక మంగళవారం ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ న్యాయమూర్తి బోయ శ్రీనివాసులును కోర్టులో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

సాంకేతికతను

అందిపుచ్చుకోవాలి

నారాయణపేట: ఉపాధినిచ్చే సాంకేతిక విద్య ను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని చేనేత, జౌళిశాఖ అధికారులు బి.రాజేష్‌బాబు, ఎస్‌.విజయ్‌కుమార్‌ కోరారు. మంగళవారం జిల్లాకేంద్రంలో విద్యార్థులకు నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరై మాట్లాడారు. పదోతరగతి పూర్తి చేసిన విద్యార్థులు సంప్రదాయ కోర్సులకు మాత్రమే పరిమితం కాకుండా 100 శాతం ఉపాధి అవకాశాలు కలిగిన సాంకేతిక వృత్తి విద్య కోర్సులపై దృష్టి సారించాలని సూచించారు. 2026–27 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సు ప్రత్యేకతలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించారు. విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా ప్రభుత్వం ప్రతి నెల రూ.2,500 స్టైఫండ్‌ అందిస్తోందని, చేనేత కుటుంబాలకు చెందిన విద్యార్థులకు అదనంగా నెలకు రూ.5 వేలు చెల్లిస్తుందని వివరించారు. ఏడాదికి కేవలం రూ.4,250 నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన సాంకేతిక విద్యను అభ్యసించే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రముఖ వస్త్ర పరిశ్రమల్లో డిజైనర్లు, మేనేజర్లు వంటి పదవుల్లో స్థిరపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్‌ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి కనీస అర్హత 10వ తరగతి అని, 60 సీట్లు ఉండగా.. మెరిట్‌ ఆధారంగా భర్తీ చేస్తారని తెలిపారు. దరఖాస్తునకు చివరి గడువు ఏప్రిల్‌ చివరి వారమని, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఉన్న దరఖా స్తు కేంద్రంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. విద్యార్థుల సందేహాలను అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో జిల్లా లోని చేనేత సహకార సంఘాల అధ్యక్షులు ఆంజనేయులు, బత్తుల సతీష్‌, సౌడం నర్సింహులు, ఐఐహెచ్‌టీ సిబ్బంది ఎం.శివమణి, బి.స్వప్న (అధ్యాపకులు), పలు పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement