నర్వ:జిల్లాలో వరి, మొక్కజొన్న కొనుగోళ్లను వేగ వంతం చేయాలని రాష్ట్ర పశుసంవర్ధకశాఖమంత్రి వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు. బుధవారం మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. గన్నీ బ్యాగులు ఇవ్వ డం లేదని, మొక్కజొన్న కొనుగోళ్లలో లారీలు రాక పోవడంతో పాటు గోదాములు కేటాయించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని రైతులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ శ్రీలతతో మంత్రి ఫోన్‌లో మాట్లాడి కొనుగోళ్ల ప్ర క్రియ వేగవంతం చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని ఆదేశించారు. ధాన్యం తరలించేందుకు లారీలను సమకూర్చాలన్నారు. అనంతరం కేంద్రానికి వచ్చిన మంత్రిని పీఏసీఎస్ చైర్మన్ రాయికోడ్ శ్రీనివాస్‌రెడ్డి, సీఈఓ ఉదయ్‌కుమార్ శాలువాలతో సన్మానించారు. మంత్రి వెంట కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బీసం చెన్నయ్యసాగర్, ఆత్మకూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ డి.కృష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, శరణప్ప, వివేకవర్ధన్‌రెడ్డి, కల్వల్ సర్పంచ్ చెన్నప్ప, జనార్ధన్‌రెడ్డి, రామకృష్ణ, సద్దల ఆంజనేయరెడ్డి ఉన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ప్రారంభం
మక్తల్:మండలంలోని జక్లేర్ స్టేజీ సమీపంలో విద్యు త్ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతు కేంద్రాన్ని బుధవారం తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్వ, ఊట్కూర్ మండలాల ట్రా న్స్ ఫార్మర్ల మరమ్మతుకు ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేశామని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరా రు. కార్యక్రమంలో ఎస్‌ఈ నవీన్‌కుమార్, ఏడీఏలు విజయభాస్కర్, గంగాధర్, ఏఈలు రామకృష్ణ, అశోక్, మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, మాధవరావు, నర్సింహ, భరత్, శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.


