ఆటలకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

ఆటలకు వేళాయె..

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

దరఖాస్తుల ఆహ్వానం..

వీరికే ప్రాధాన్యం..

–8లో u

నర్వ: గ్రామీణ ప్రాంతాల్లో ఏటా నిర్వహించే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలకు వేళయింది. తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ రూపొందించిన కార్యాచరణ ప్రకారం జిల్లాలో శనివారం నుంచి జూన్‌ 6 వరకు పది గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా శిబిరాలు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. 41 రోజుల పాటు వివిధ ప్రాంతాల మైదానాల్లో శిబిరాలు కొనసాగనున్నాయి.

వేసవి క్రీడా శిబిరాల నిర్వహణకు శిక్షకుల నుంచి దరఖా స్తులు ఆహ్వానిస్తున్నారు.ఆసక్తి కలిగిన పీ డీలు, పీఈటీలు, సీనియర్‌ జాతీయస్థాయి క్రీడాకారులు పూర్తి వివరాలతో శనివారం సాయంత్రం 5 గంటల్లోగా జిల్లా యువజన క్రీడాశాఖలో దర ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. శిక్షకులకు రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తారు.

గ్రామీణ ప్రాంతాల్లో వేసవి శిక్షణ శిబిరాలు

నేటి నుండి జూన్‌ 6 వరకు..

మండలస్థాయిలో

శిక్షకులకు పారితోషికం

ఆన్‌లైన్‌లో నమోదు..

ధ్రువపత్రాల అందజేత

గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు వివిధ ఆటల్లో శిక్షణ ఇవ్వడం ఈ శిబిరాల ముఖ్య ఉద్దేశం. శిబిరాల్లో 14 ఏళ్లలోపు బాలబాలికలకు మాత్రమే శిక్షణనిస్తారు. నచ్చిన క్రీడలో శిక్షణ పొంది నైపుణ్యాలను ప్రదర్శించేందుకు గొప్ప అవకాశం. కబడ్డీ, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, నెట్‌బాల్‌, హాకీ, జూడో తదితర క్రీడల్లో తర్ఫీదు ఇవ్వనున్నారు. ఆసక్తిగల విద్యార్థులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement