ఇళ్ల గణన షురూ..! | - | Sakshi
Sakshi News home page

ఇళ్ల గణన షురూ..!

May 13 2026 1:44 AM | Updated on May 13 2026 1:44 AM

పురపాలికల వారీగా..

మండలాలు, పురపాలికల్లో గృహాలు.. జనాభా వివరాలు

విస్తృత ప్రచారం..

పకడ్బందీగా జనగణన..

–8లో u

నారాయణపేట: జనగణన–2027లో కీలకమైన గృహ జాబితా సేకరణ ప్రక్రియ జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి కొనసాగుతోంది. జనగణన రెండు దశల్లో జరగనుండగా.. తొలివిడత ఈ నెల 11 నుంచి జూన్‌ 9 వరకు ఇళ్ల గణన చేపడతారు. రెండోవిడత వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డిజిటల్‌ విధానంలో జనాభా లెక్కిస్తారు. ఇందుకోసం 1,054 మంది ఎన్యూమరేటర్లు, 178 మంది సూపర్‌వైజర్లు, ఛార్జ్‌ అధికారులకు నాలుగు విడతల్లో శిక్షణనిచ్చారు. ఈ ఏడాది స్వీయగణనకు అవకాశం ఇవ్వగా.. జిల్లావ్యాప్తంగా 11,244 మంది గృహ యజమానులు తమ వివరాలను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోగా, ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని చెప్పవచ్చు.

● జిల్లాలోని 13 మండలాల్లో ఉన్న 250 గ్రామపంచాయతీలు, నాలుగు పురపాలికల్లోని 1,09,902 ఇళ్లకు గణకులు వెళ్లి వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. 2027 నాటికి 1,26,052 గృహాలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తూ ఆ దిశగా గణన చేపట్టారు. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 5,62,148 మంది ఉండగా.. 2027లో 6,64,350 మంది ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

గడప గడపకు నంబర్ల కేటాయింపు..

తొలిసారిగా మొబైల్‌ యాప్‌లో జనగణన వివరాలు నమోదు చేస్తున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు సుమారు 200 ఇళ్లు కేటాయించారు. మొదటి మూడురోజులు వీరు ఇళ్లను మ్యాపింగ్‌ చేయడంతో పాటు నంబర్లను కేటాయించే పనిలో నిమగ్నమయ్యారు. ఇంటి గోడ లేదా తలుపునకు సీఎన్‌, ఇంటి నంబరు, బ్లాక్‌ సంఖ్య రాస్తున్నారు. దీంతో ఎన్ని ఇళ్లు ఉన్నాయనేది తెలుస్తుంది. ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబ సభ్యులు, తాగునీరు, విద్యుత్‌, శౌచాలయాలు తదితర 33 రకాల వివరాలను హెచ్‌ఎల్‌ఓ యాప్‌లో నమోదు చేస్తారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలనూ పొందుపరుస్తారు. స్వీయగణనకు ఈ నెల 10 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించగా.. జిల్లాలో కేవలం 11,244 మంది మాత్రమే తమ వివరాలు నమోదు చేసుకున్నారు. జిల్లా అధికారులు స్వీయగణనపై నెలరోజుల పాటు ప్రజలకు అవగాహన కల్పించినా.. ఆశించిన స్పందన రాకపోవడం కొసమెరుపు.

రెండు దశల్లో..

జనగణన ప్రక్రియను రెండు ప్రధాన దశలుగా విభజించారు. మొదటి దశలో ప్రతి భవనం, ఇంటిని గుర్తిస్తారు. ఆస్పత్రులు, పాఠశాలలు, దేవాలయాలు, అద్దె ఇళ్లు, చివరకు గుడిసెలను వదలకుండా లెక్కిస్తారు. ఎన్యూమరేటర్లు జూన్‌ 9 వరకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రతి భవనానికి మార్కింగ్‌ చేస్తారు. 2027, ఫిబ్రవరిలో రెండోదశ ప్రారంభమవుతుంది. ఈ దశలో ప్రతి వ్యక్తికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి కుటుంబం ఈ ప్రక్రియలో భాగస్వాములు కావాలని, డిజిటల్‌ డేటా సేకరణ ద్వారా భవిష్యత్‌లో సంక్షేమ పథకాల అమలు మరింత పారదర్శకంగా మారుతుందని అధికారులు చెబుతున్నారు.

మండలం జీపీలు/ గృహాలు హెచ్‌ఎల్‌బీలు 2011 2025–26

వార్డులు జనాభా జనాభా అంచనా..

మక్తల్‌ 39 9988 87 52,590 62,706

దామరగిద్ద 27 10,400 101 55,151 66,571

ఊట్కూర్‌ 27 10,452 94 54,533 64,412

నారాయణపేట 26 11,333 113 58,881 69,375

మాగనూర్‌ 20 4753 45 24,192 29,574

నర్వ 20 6221 54 31,536 33,536

మద్దూర్‌ 17 6275 70 31,482 38,168

కోస్గి 16 4142 41 19,559 22,648

కృష్ణా 14 4629 43 23,765 26,520

మరికల్‌ 14 7506 64 37,650 43,764

కొత్తపల్లి 11 3620 38 19176 23,249

గుండుమాల్‌ 10 3980 47 19932 23,080

ధన్వాడ 9 7417 79 37,770 47,775

నారాయణపేట 24 7,914 73 41,752 49,193

మక్తల్‌ 16 4276 43 19,438 22,595

కోస్గి 16 4366 37 21,215 24,565

మద్దూర్‌ 16 2630 25 13,526 16,399

జనగణనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రచార రథాన్ని విస్తృతంగా గ్రామాలు, నగరాల్లో తిప్పుతున్నారు. ఈ రథాన్ని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక కలెక్టరేట్‌లో ప్రారంభించారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు జనగణన–2027ను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేలా అధికార యంత్రాంగం పనిచేస్తుంది. సర్వేలో మొదటి మూ డురోజులు సంబంధిత ప్రాంతం మ్యాప్‌, ప్ర ధాన ల్యాండ్‌మార్క్‌ (గుర్తు చిహ్నాలు), డిజిట ల్‌ ఎంట్రీ భవనాల గణన, గృహాలసంఖ్యను యాప్‌లో నమోదు చేస్తారు. ఎన్యూమరేటర్ల లాగిన్‌ నుంచి సూపర్‌వైజర్‌ లాగిన్‌కు వస్తా యి. తర్వాత జనగణన పోర్టల్‌కు వస్తాయి. వాటిని కలెక్టర్‌ లాగిన్‌ చేసుకొని జనగణన పూర్తి వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తారు.

– ఖఘువాహన్‌, సీపీఓ, నారాయణపేట

ఇంటింటికి నంబర్ల కేటాయింపు

జూన్‌ 9 వరకు వివరాల సేకరణ

స్వీయగణనకు స్పందన అంతంతే..

జిల్లాలో నివాస గృహాలు 1,09,902.. హౌజ్‌ లిస్టింగ్‌ బ్లాక్‌లు 1,054

ఎన్యూమరేటర్లు 1,054..

సూపర్‌వైజర్లు 178 మంది

Advertisement
 
Advertisement
Advertisement