ఈత సరదా విషాదం కారాదు..
నారాయణపేట: యాసంగి వరి ధాన్యం కొనుగోలు సందర్భంగా పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు వరి ధాన్యం అక్రమంగా తరలకుండా, అలాగే రాష్ట్రంలోని పీడీఎస్, సీఎంఆర్ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాకుండా నిరోధించేందుకు జిల్లా పరిధిలో ఆరు సరిహద్దు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన ట్లు ఎస్పీ డా. వినీత్ శుక్రవారం వెల్లడించారు. జిల్లా లోని నారాయణపేట మండలం జలాల్‌పూర్, దా మరగిద్ద మండలం కానుకుర్తి, కృష్ణా మండలం చేగుంట సమీపంలోని కృష్ణానది వంతెనపై, ఊట్కూర్ మండలం సమస్తాపూర్, మాగనూర్ మండలం ఉజ్జెల్లి వద్ద చెక్‌పోస్ట్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పూర్తిస్థాయి నిఘా ఉంచాలని ఎస్పీ తెలిపారు. వరి ధాన్యం అక్రమంగా జిల్లాకు తరలకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని.. చెక్‌పోస్టు నుంచి వెళ్లే ప్రతి వాహనానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వేబిల్స్, ఇతర రవాణా పత్రాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, అక్ర మంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ అయితే చట్టపరమై న చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్ర తి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, డ్రైవర్ వివరాలు, గమ్యస్థానం వంటి సమాచారాన్ని రిజిస్టర్‌లో నమో దు చేయాలని, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లపై ప్రత్యేక నిఘా ఉంచాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద మాత్రమే కాకుండా సరిహద్దు గ్రామాల ద్వారా అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక పహారా ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలీస్‌స్టేషన్ల హెచ్‌ఓలు చెక్‌పోస్టుల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని, విధుల్లో ఉన్న పోలీస్, రెవెన్యూ సిబ్బంది తరచూ తనిఖీ చేస్తూ అప్రమత్తంగా ఉండేలా చూడాలన్నారు. జిల్లా ప్రజలు సహకరించి, అనుమానాస్పద వాహనాలు, వరి అక్రమ రవాణాను గుర్తించే చవెంటనే సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
పాఠశాలలు, కళాశాలలకు వేసవి సెలవులు రావడంతో ఎంతోమంది పిల్లలు, యువత ఎండ నుంచి ఉపశమనానికి ఈత నేర్చుకోవడానికి జలాశయాలు, స్విమ్మింగ్ పూల్స్‌కు వెళ్తుంటారని.. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ డా. వినీత్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. ఈత రానివారు నదులు, బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లరాదని, నేర్చుకునేపై వారి తల్లిదండ్రులు, శిక్షకుల పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో గ్రామ అధికారులతో కలిసి జలాశయాల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.


