మక్తల్: బాలికలు చదువు మధ్యలో మానేయకుండా ఉన్నత విద్యపై శ్రద్ధ చూపాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అన్నారు. బుధవారం స్థానిక పుర కార్యాలయంలో మహిళ, శిశుసంక్షేమశాఖ ఆధ్వర్యంలో బాలికలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఆన్‌లైన్ గేమింగ్, సైబర్ నేరాలు, చిన్నారులను మోసం చేయడం, ఇబ్బందులకు గురిచేయడం తదితర విషయాల గురించి వివరించారు. మెస్సేజ్ యాప్ ద్వా రా పిల్లలను ట్రాప్ చేస్తుంటారని.. తగిన జాగ్రత్తలు పాటించాలని సూ చించారు. చదువుకు మాత్రమే సెల్‌ఫోన్ వినియోగించాలని, చదువుతోనే జీవితా లు బాగు చేసుకోవాని తెలిపారు. కార్యక్రమంలో పుర చైర్‌పర్సన్ వాకిటి మానస, ఆర్డీఓ రాజేందర్‌గౌడ్, పుర కమిషనర్ నర్సయ్య, సీడీపీఓ సరోజినీ మట్ట, రమేశ్, సూపర్‌వైజర్ మల్లేశ్వరి, అమ్మక్క తదితరులు పాల్గొన్నారు.
కొడంగల్ ఎత్తిపోతల పనుల పరిశీలన..
మక్తల్–కొడంగల్–నారాయణపేట ఎత్తిపోతల పనులను బుధవారం కలెక్టర్ ప్రియాంక పరిశీలించా రు. మ్యాప్ ను చూసి సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులు త్వరగా, నాణ్యతగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాట్రెవ్‌పల్లి పంప్‌హౌజ్, మంతన్‌గోడ్ దగ్గర కొనసాగుతున్న పనులను పరిశీలించారు. అంతకుముందు భూత్పూర్ రిజర్వాయర్‌ను సందర్శించారు. అక్కడి రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.


