సర్వే.. సాధ్యమేనా? | - | Sakshi
Sakshi News home page

సర్వే.. సాధ్యమేనా?

May 1 2026 8:08 AM | Updated on May 1 2026 8:08 AM

నిరాసక్తతకు కారణాలు..

కమీషన్‌ సరికాదు..

లైసెన్స్‌డ్‌ సర్వేయర్ల విధులు, జీతభత్యాలపై స్పష్టత కరువు

–8లో u

నర్వ: భూభారతి అమలులో భాగంగా భూ రికార్డుల ప్రక్షాళన, సర్వే వ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పరీక్ష ద్వారా లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను నియమించింది. శిక్షణ పొంది లైసెన్స్‌లు అందుకున్న సర్వేయర్లకు మండలాలు కేటాయించినా.. విధులు, జీతభత్యాలపై స్పష్టత లేకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొని చాలామంది ఉద్యోగాల్లో చేరడం లేదు. జిల్లాలో వేలాది భూ దరఖాస్తులు సర్వేతో ముడిపడి ఉండగా.. సర్వేయర్ల కొరతతో పరిష్కారం కావడం లేదు.

జిల్లాలో 74 మంది..

జిల్లాలో 74 మంది సర్వేయర్లను ఎంపిక చేసి గతేడా ది డిసెంబర్‌లో మండలాలను కేటాయిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు నెలల కిందట హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా వారికి లైసెన్సులు అందజేశారు. కానీ చాలామంది సర్వేయర్లు విధుల్లో చేరకపోవడంతో వీరికి రెండేళ్లు గడువు ఇచ్చారు.

రైతుల ఎదురుచూపులు..

సర్వేతో ముడిపడిన వేలాది దరఖాస్తులు తహసీల్దార్‌ కార్యాలయాల్లో పేరుకుపోయాయి. ఓ రైతుకు చెందిన భూమి మరోరైతు దున్నుకోవడం, ఎత్తిపోతల పథకాలు, సాగునీటి కాల్వల్లో భూమి కోల్పోకపోయినా తొలగించడం, భూమి ఉన్నా పట్టాదారు పాసు పుస్తకాల్లో నమోదు కాకపోవడం వంటి కారణాలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వే కోసం దరఖాస్తు చేసుకొని నెలల తరబడి తిరుగుతున్నా సర్వేయర్లు రావడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేయర్లు విధుల్లో చేరితేనే దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతాయని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు విధుల్లో చేరేలా చూడాలని అన్నదాతలు కోరుతున్నారు.

జిల్లాకు 74 మంది కేటాయింపు

గతేడాది డిసెంబర్‌లో ఉత్తర్వులు జారీ

విధుల్లో చేరేందుకు

ఆసక్తి చూపని వైనం

వేలాది భూ దరఖాస్తులు పెండింగ్‌

ఉద్యోగ భద్రత కల్పించకపోవడం.

సర్వే కోసం రైతు చెల్లించిన రుసుంలో

70 శాతం కమీషన్‌ విడతల వారీగా

చెల్లిస్తామనడం.

కనీస వేతనం ప్రకటించకపోవడం.

గ్రామంలో సర్వే పూర్తిచేస్తే రూ.20 వేలు

చెల్లిస్తామని చెప్పడం.

ఉద్యోగ భద్రత, విధులు, జీతభత్యాలపై స్పష్టత వస్తేనే ఉద్యోగాల్లో చేరుతామని సర్వేయర్లు చెబుతున్నారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో సర్వేయర్లకు నెలకు రూ.24 వేలు చెల్లిస్తున్నారని.. తమకు కమీషన్‌ ఇస్తామని చెప్పడం సరికాదంటున్నారు. ల్యాప్‌టాప్‌, సర్వే కిట్లు అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement