పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు, నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయంపై ప్రభావం చూపుతాయి. రైతులు, మధ్యతరగతి కుటుంబాలు, చిన్న వ్యాపారులతో పాటు ప్రతి కుటుంబంపై ఆర్థిక భారం పడుతుంది. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వ హయంలో ఒక్క రూపాయి పెంచితే బీజేపీ రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టేది. ఏకంగా ఒకేసారి రూ.3 పెంచడం సరైంది కాదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించకపోతే నిరసన సెగలు తప్పవు.
– కె.ప్రశాంత్‌కుమార్‌రెడ్డి,
డీసీసీ అధ్యక్షుడు, నారాయణపేట
ఆర్థిక ఒత్తిడి..
ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే పె ట్రోల్, డీజిల్ ధరల పెంపు అనేది ప్రజల్లో ఎన్నికలయ్యే వరకు ధరలు ని యంత్రించి తర్వాత భారాన్ని మోపుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది. సామాన్య ప్రజలు ఇప్పటికే పెరుగుతున్న జీవన వ్యయం, నిరుద్యోగం, వ్యవసాయ ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఇంధన ధరల పెంపు ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది. – జి.శ్రీనివాస్,
జిల్లా అధ్యక్షుడు, టీఆర్‌ఎస్, నారాయణపేట


