పశుపోషణతో అదనపు ఆదాయం | - | Sakshi
Sakshi News home page

పశుపోషణతో అదనపు ఆదాయం

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

నారాయణపేట: పశుపోషణతో సన్న, చిన్నకారు రైతులకు అదనపు ఆదాయంతో పాటు జీవనోపాధి లభిస్తుందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ అదనపు సంచాలకుడు డా. బి.సుబ్బారాయుడు అన్నారు. జిల్లాకేంద్రంలోని పశువైద్యశాల, జిల్లా పశుసంవర్ధక అధికారి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ఉచిత పశువైద్య శిబిరం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు, పశు సంరక్షణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులు దూడల సంరక్షణలో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు, పశుగ్రాస సాగుపై రైతులు దృష్టి సారించాలని, వేసవిలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కౌన్సిలర్‌ కాకర్ల నారాయణమ్మ కుటుంబ పోషణకు పాడి పరిశ్రమను కొనసాగించడం ఆదర్శనీయమని గుర్తుచేస్తూ అభినందించారు. జిల్లా పశు వైద్యాధికారి డా. బి.ఈశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో చాలామంది గొర్రెల పెంపకం చేపడుతూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పాడిపశువుల పెంపకంపై ఆసక్తి కనబర్చాలని సూచించారు. రైతుల సౌకర్యార్థం జిల్లాకేంద్రంలో పాల శీతలీకరణ కేంద్రం ఏర్పాటు చేస్తామని.. పాడి రైతులు, మహిళా సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ చైర్మన్‌ ఆర్‌.శివారెడ్డి, పుర చైర్‌పర్సన్‌ కొండ శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల, కౌన్సిలర్‌ సత్యమ్మ, బీకేఎస్‌ నాయకులు వెంకోబ, విశ్వనాథ్‌రెడ్డి, అనంతరెడ్డి, పశు వైద్యాధికారులు డా. బి.వెంకటేశ్వర్లు, డా. అనిరుధ్‌ ఆచార్య, డా. రాఘవేందర్‌గౌడ్‌, డా. రోహిత, డా. శ్రీనివాస్‌, సిబ్బంది గోపాలమిత్రులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement