జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో సోమవారం వేరుశనగ క్వింటా గరిష్టంగా రూ.6,899, కనిష్టంగా రూ.5,688 ధర పలికింది. అలాగే ఆముదాలు క్వింటాల్ రూ.6,239, జొన్నలు రూ.2,177, రాగులు రూ.3,079, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,479, కనిష్టంగా రూ.2,256, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,836, కనిష్టంగా రూ.1,786, పొద్దుతిరుగుడు రూ.5,690, కందులు రూ.6,276 చొప్పున లభించాయి.
● దేవరకద్ర మార్కెట్ యార్డులో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర క్వింటాల్ గరిష్టంగా రూ.2,229, కనిష్టంగా రూ.1,959, హంస గరిష్టంగా రూ.1,800, కనిష్టంగా రూ.1,719, ఆముదాలు గరిష్టంగా రూ.6,080, కనిష్టంగా రూ.6,050 చొప్పున నమోదయ్యాయి.


