మక్తల్: నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర పశుసంవర్ధఽకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియోజకవర్గంలోని 19 రహదారుల నిర్మాణానికి రూ.68 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. ఆత్మకూర్–గద్వాల హైలెవల్ వంతెన నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని వివరంచారు. కొల్పూర్ కుర్తికొండ దగ్గర మినీ జూరాల బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణానికి రూ.800 కోట్ల మంజూరుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. హిందూపూర్ దగ్గర ఽథర్మల్ పవర్‌స్టేషన్‌కు సైతం త్వరలో గ్రీన్‌సిగ్నల్ రానుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వెటర్నరీ ట్రైనింగ్ సెంటర్ అనంతపురంలో ఉండేదని.. సీఎం చొరవతో మక్తల్‌కు మంజూరు చేయించినట్లు వివరించారు. అలాగే మక్తల్‌కు డిగ్రీ కళాశాల, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, కోర్టు భవన నిర్మాణాలకు నిధులు విడుదలయ్యాయని చెప్పారు. పట్టణానికి 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ తీసుకొస్తామని వెల్లడించారు. కాంగ్రెస్ హయంలోనే 150 పడకలు ఆస్పత్రి నిర్మాణం చేపట్టి త్వరలో ప్రారంభిస్తామని చెప్పారు. సమావేశంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్‌కుమార్, కో–ఆప్షన్ సభ్యుడు లక్ష్మణ్, సురేష్, రవికుమార్, సాగర్, రాజప్పగౌడ్, యజ్ఞేశ్వర్‌రెడ్డి, పరమేష తదితరులు పాల్గొన్నారు.
● స్థానిక పుర కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం చైర్‌పర్సన్ వాకిటి మానస అధ్యక్షతన సాధారణ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి హాజరయ్యారు. ముందుగా 6వ వార్డు కౌన్సిలర్ చందాపూర్ సత్యమ్మతో కమిషనర్ రాజయ్య ప్రమాణం చేయించారు. అనంతరం జరిగిన సమావేశంలో పురపాలికలోని 1, 2, 4, 6 వార్డుల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని మంత్రికి కౌన్సిలర్లు విన్నవించారు. అండర్‌గ్రౌండ్, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని కోరారు. పుర అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఫణింద్రారెడ్డి, వైస్ చైర్మన్ శైవి రెడ్డి, ఏఈఈ నాగశివ, కౌన్సిలర్లు ఆల్కూరి పావని, మహేష్, శ్రీవిద్య, సరిత, అనిత, రహీం పటేల్, వెంకటేశ్వర్లు, రాజశేఖర్‌రెడ్డి, పీకే నర్సింహ, కృష్ణ, సత్యమ్మ పాల్గొన్నారు.


