నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యార్డులో మంగళవారం ఆలసందలు క్వింటా సరాసరిగా రూ.4,500 ధర పలికాయి. అదేవిధంగా వరి హంసరకం రూ.1,650, వరి సోనారకం గరిష్టంగా రూ.2,462, కనిష్టంగా రూ.1,555 ధరలు లభించాయి.
ఆయిల్‌పాం సాగుతో అధిక ప్రయోజనం
దామరగిద్ద: ఆయిల్‌పాం సాగుతో అధిక ప్రయోజనం పొందవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమలశాఖ అధికారి సాయిబాబా సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయిల్‌పాం సాగుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దీర్ఘకాలిక లాభదాయకమైన పంట అని.. ప్రభుత్వ ప్రోత్సాహంతో తక్కువ పెట్టుబడితో సాగు చేయవచ్చని సూచించారు. సాంప్రదాయ పంటల కంటే అధిక ఆదాయం లభిస్తుందని తెలిపారు. ఆయిల్‌పాం సాగులో తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలను కోస్గి ఉద్యాన అధికారి హర్షవర్ధన్‌రెడ్డి వివరించారు. తెలంగాణ ఆయిల్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్ మార్కెట్ సౌకర్యాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఈఓ వినోద్‌కుమార్, సర్పంచ్ కన్కిరెడ్డి, శరణ్‌నాయక్, సంగారెడ్డి, ఎఫ్‌ఓ ప్రియ, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, రైతులు పాల్గొన్నారు.


