మార్కెట్‌ ఏర్పాటు చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ ఏర్పాటు చేయాలి..

Apr 28 2026 7:29 AM | Updated on Apr 28 2026 7:29 AM

కొల్లాపూర్‌లో వేలాది మామిడి రైతులు ఉన్నారు. వారి శ్రమను వ్యాపారులు దోస్తున్నారు. దీన్ని ప్రభుత్వం సీరియస్‌ అంశంగా గుర్తించారు. గతంలో మాచినేనిపల్లి సమీపంలో, ప్రభుత్వ పీజీ కళాశాల సమీపంలో మామిడి మార్కెట్‌ ఏర్పాటుకోసం స్థలాలను గుర్తించారు. రెండింట్లో ఏదో ఒక చోట మార్కెట్‌ ఏర్పాటుచేసి, వ్యాపారులు ఇక్కడే కాయలు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటే రైతులకు మేలు చేకూరుతుంది. – సాయికృష్ణగౌడ్‌, మామిడి రైతు, సింగోటం

ధరలు తగ్గించేశారు..

రైతులకు మామిడి పంట ఇప్పుడిప్పుడే చేతికొస్తోంది. ఈ సమయంలోనే ధరలు తగ్గించడం దారుణం. గాలివానకు భయపడి రైతులు కాయలు తెంచుతున్నారు. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు తగ్గించేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం కాయలు అమ్మితే రైతుకు నష్టమే తప్ప లాభం ఉండదు. దీనిపై అధికారులు దృష్టిపెట్టాలి. రైతులకు న్యాయం జరిగేలా చూడాలి.

– పెద్దూరి లక్ష్మయ్య, మామిడి రైతు, కొల్లాపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement