నారాయణపేట: భగీరథ మహర్షి దీక్ష సంకల్పం, నిస్వార్థ సేవాభావం అందరికీ స్ఫూర్తిదాయక మని అదనపు కలెక్టర్ ఫణీంద్రారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. కఠోర దీక్ష, పట్టుదలకు భగీరథ మహర్షి ప్రతీకగా నిలుస్తారన్నారు.సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలను తొలగించేందుకు భగీరథుడి అ డుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నా రు. ముఖ్యంగా యువత ఆయన జీవితం నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ శ్రీధర్, జిల్లా బీసీ సంక్షే మశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, డీపీఆర్వో ఎంఏ రషీద్, సగర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు సాగర్, ప్రధాన కార్యదర్శి వెంకటయ్య, పట్టణ అధ్యక్షుడు విజయ్ సాగర్, సంఘం సభ్యులు ఆంజనేయులు, నరేందర్, వెంకటేశ్, మన్నె లక్ష్మణ్, హన్మంతు, రవి, రాంపూర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.


