యూనివర్సిటీలో రూ.113 కోట్లతో కొనసాగుతున్న పనులు
యూనివర్సిటీలో మొత్తం 13 కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సీట్లు సరిపోకపోవడంతో విద్యార్థి అడ్రస్ నుంచి ఉన్న దూరం ఆధారంగా సీట్ల కేటాయింపులు చేస్తున్నారు. వీటికి తోడు లా, ఇంజినీరింగ్ కళాశాలలు కూడా కొత్తగా రావడంతో ఇక్కడ అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ప్రస్తుతం ఉన్న పాత బాలబాలికల హాస్టళ్లలోనే వసతి కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రెండు కళాశాలలకు సంబంధించిన విద్యార్థుల సంఖ్య రెట్టింపు కానుండటంతో పీయూలో ఒకేసారి నాలుగు హాస్టళ్లు నిర్మిస్తున్నారు. రెండు హాస్టళ్లు యూనివర్సిటీ ద్వారానే నిర్మిస్తుండగా ఒక బాలిక, ఒక బాలుర హాస్టల్స్‌ను ఎస్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఉన్న హాస్టళ్లకు వీటితో సీట్లు రెట్టింపు కానున్నాయి.
పీయూలో కొనసాగుతున్న
అభివృద్ధి పనులు ఇలా..
నిధులు (రూ.కోట్లలో..)


