కనులపండువగా నర్సింహస్వామి రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా నర్సింహస్వామి రథోత్సవం

May 3 2026 8:17 AM | Updated on May 3 2026 8:17 AM

మాగనూర్‌: మండల కేంద్రంలో కొనసాగుతున్న శ్రీలక్ష్మీనర్సింహాస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం తెల్లవారుజామున రథోత్సవ వేడుకలు కనులపండువగా నిర్వహించారు. ముందుగా స్వామివారికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రథంలో ఉత్సవ విగ్రహాలను పల్లకీ ఉంచి, అర్చకుల వేదమంత్రాలు, భాజాభజంత్రీల మంగళ వాయిద్యాలతో భక్తులు రథం ముందుకు లాగారు. ఉత్సవాలను తిలకించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, హైదరాబాద్‌, సోలాపూర్‌ తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చారు. మంత్రి వాకిటి శ్రీహరి హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రికి తీర్థప్రసాదాలు అందించి, ఆశీర్వదించారు.

పాల ఉట్ల ఉత్సవం..

సాయంత్రం పాల ఉట్ల ఉత్సవం నిర్వహించగా.. యువకులు ఉట్ల స్తంభాన్ని ఎక్కేందుకు పోటీ పడ్డారు. చివరికి గ్రామానికి చెందిన పాలట్ల బులిమేని నరేష్‌ ఉట్ల స్తంభంపైకి ఎక్కారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటలు జరగకుండా ఎస్‌ఐ పి.అశోక్‌బాబు ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్త్‌ ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆల య కమిటీ సభ్యులు రమేష్‌గౌడ్‌, డబ్బ కృష్ణయ్య, భరత్‌కూమార్‌, గ్రామపెద్దలు వాకిటి శ్రీనివాస్‌, ఆనంద్‌గౌడ్‌, నరేష్‌, కృష్ణయ్య, సత్యప్ప, ఆనంద్‌, చక్రపాణిరెడ్డి, ఉజ్జెల్లి కృష్ణయ్య, వెంకటయ్య, చెన్నప్ప యువకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement