మూడోరోజు కొనసాగిన సమ్మె | - | Sakshi
Sakshi News home page

మూడోరోజు కొనసాగిన సమ్మె

Apr 25 2026 8:06 AM | Updated on Apr 25 2026 8:06 AM

పోలీసు బందోబస్తు..

నారాయణపేట రూరల్‌: జిల్లాకేంద్రంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడోరోజు శుక్రవారం ప్ర శాంతంగా కొనసాగింది. డిపో ఎదుట ఏర్పాటు చేసిన శిబిరంలో డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్‌లు కూర్చొని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ త మ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వి జ్ఞప్తి చేశారు. సీఐటీయూ, భూ నిర్వాసితుల సంఘం, జాగృతిసేన, బహుజన సమాజ్‌పార్టీ నాయకులు సమ్మె శిబిరానికి చేరుకొని ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ కార్మికుల పక్షాన సీఎం రేవంత్‌రెడ్డి నిలబడాలని డిమాండ్‌ చేశారు.

పట్టణంలో మౌన ర్యాలీ..

ఆత్మహత్య చేసుకున్న శంకర్‌గౌడ్‌ చిత్రపటానికి నారాయణపేట ఆర్టీసీ కార్మికులు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం డిపో నుంచి సత్యనారాయణ చౌరస్తా, పాత బస్టాండ్‌ మీదుగా కొత్త బస్టాండ్‌ వరకు మౌనం పాటిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఆత్మహత్యలు పరిష్కారం కావని, ప్రతి ఒక్కరూ సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. మూడురోజులుగా సమ్మె చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరం వద్ద పోలీసు బందోబస్తు పెంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్దఎత్తున పోలీసులు మోహరించారు. అదేవిధంగా బస్టాండ్‌ ప్రాంగణంలో ఫైరింజన్‌తో పాటు 108 వాహనాన్ని అందుబాటులో ఉంచారు.

Advertisement
 
Advertisement
Advertisement