సూచనలు ఇస్తాను.. | - | Sakshi
Sakshi News home page

సూచనలు ఇస్తాను..

May 12 2026 1:32 AM | Updated on May 12 2026 1:32 AM

సూచనలు ఇస్తాను..

నవాబ్‌పేట పీహెచ్‌సీలో రెండేళ్లుగా నర్సుగా పని చేస్తున్నాను. పీహెచ్‌సీకి వచ్చే వారిలో చాలామంది వైద్యంపై ఎలాంటి అవగాహన లేకుండా వస్తుంటారు. అలాంటి వారికి సమస్య తెలుసుకుని చికిత్స అందిస్తుంటాను. మారుమూల పల్లెల నుంచి రాత్రివేళలో పలు రకాల సమస్యలతో వస్తుంటారు. వారందరికి కావాల్సిన ప్రాథమిక చికిత్స అందిస్తుంటాను. ఇక ఈ పీహెచ్‌సీలో కాన్పులు అధికంగా అవుతుంటాయి. గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ప్రసవం తర్వాత ఎలాంటి ఆహారం తీసుకువాలనే విషయంపై సూచనలు ఇస్తాను.

– పుష్పలత, నర్సు, నవాబ్‌పేట

Advertisement
 
Advertisement
Advertisement