ఉపాధి.. లక్ష్యం చేరేనా? | - | Sakshi
Sakshi News home page

ఉపాధి.. లక్ష్యం చేరేనా?

May 9 2026 7:26 AM | Updated on May 9 2026 7:26 AM

జిల్లాకు 9.12 లక్షల పనిదినాల కేటాయింపు

గతేడాది ఏప్రిల్‌ నుంచి నేటి వరకు 1.54 లక్షలు మాత్రమే పూర్తి

ప్రతి పంచాయతీ నుంచి అదనంగా 150 మంది కూలీలు

నెలాఖరుకు చేరుకునేలా అధికారుల చర్యలు

40 వేల వరకు

పెంచడానికి..

యాసంగి వ్యవసాయ పనులు పూర్తి చేసుకున్న కూలీలు ఉపాధి పనులకు ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం నిత్యం 20 వేల వరకు కూలీలు హాజరవుతుండగా.. ఆ సంఖ్యను 40 వేల వరకు పెంచడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో ఏటా ఏప్రిల్‌ 1న కూలీల వేతనాలు పెరిగేవి. గతేడాది కూలీల దినసరి వేతనం రూ.300 నుంచి రూ.307కు పెంచారు. ఈసారి వీబీ జీ రాంజీ పథకం మార్గదర్శకాలు ఇంకా అమలులోకి రాలేదు. కూలీల దినసరి వేతనం గురించి కూడా కేంద్రం ఎక్కడా ప్రస్తావించ లేదు. కూలి పెరగకపోవడంతో కూలీలు నిరాశ చెందుతున్నారు. అయితే కొత్త పథకంలో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 125 రోజుల పనిదినాలు కల్పిస్తామని చెప్పారు. పథకం మార్గదర్శకాలు వెలువడిన తర్వాత కూలీల వేతనాలు పెరిగే అవకాశం ఉంది.

నర్వ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామీ పథకాన్ని నెలాఖరు వరకు కొనసాగించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీ రాంబీ పథకం మార్గదర్శకాలు ఇంకా వెలువడలేదు. దీంతో పాత విధానాన్ని ఈ నెలలో కూడా కొనసాగించాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం కొనసాగుతున్న పనులనే వచ్చే నెల వరకు నిర్వహిస్తారు. కొత్త పథకం అమలులోకి వచ్చిన తర్వాత మార్గదర్శకాలు మారే అవకాశం ఉంది.

కూలీల సంఖ్య పెంపునకు..

నెల రోజులు పనిదినాలు కేటాయించడంతో అందుకు తగినట్లుగా కూలీల సంఖ్యను కూడా పెంచుకోవడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాకు ఏప్రిల్‌లో కేటాయించిన పనిదినాల్లో ఇప్పటి వరకు 1.54 లక్షల పనిదినాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌, మే నెల మొత్తం కలుపుకొని 9.12 లక్షల పనిదినాలు లక్ష్యంగా ఇచ్చారు. ఈ లక్ష్యాన్ని అధిగమించాలంటే ప్రతి పంచాయతీ నుంచి అదనంగా 150 మంది కూలీలు పనులకు వచ్చేలా లక్ష్యం నిర్దేశించారు. దీంతో కూలీల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement