బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ (Former Bangladesh Captain), ప్రస్తుత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వైస్ ప్రెసిడెంట్ అయిన ఫారూఖీ అహ్మద్ (Faruque Ahmed) తీవ్ర అస్వస్థత గురయ్యారు. ఫారూఖీకి నిన్న (నవంబర్ 9) మధ్యాహ్నం తీవ్రమైన గుండెపోటు వచ్చింది.
హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్‌గా నిర్దారించారు. యాంజియోగ్రామ్ చేయగా, గుండె ధమనాల్లో బ్లాకేజ్ గుర్తించారు. చికిత్సలో భాగంగా స్టెంట్ వేసి పూడికను తొలగించారు. క్రిటికల్ కేర్ యూనిట్‌లో (CCU) ఉంచి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

ఫారూఖీ 1984-1999 మధ్యలో బంగ్లాదేశ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలం ఆ జట్టుకు కెప్టెన్‌గానూ సేవలందించాడు. రిటైర్మెంట్ తర్వాత రెండుసార్లు జాతీయ సెలెక్టర్‌గా వ్యవహరించిన అతను.. 2024 అగస్ట్‌లో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాత్కాలిక అధ్యక్షుడిగానూ పని చేశారు.
ఈ పదవిలో 9 నెలల పాటు కొనసాగాడు. ఆతర్వాత అమినుల్ ఇస్లాం పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ఆ పదవి నుంచి తప్పుకున్నాడు. 59 ఏళ్ల ఫారూఖీ ఇటీవలే బీసీబీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఫారూఖీ సుదీర్ఘకాలం జాతీయ జట్టులో ఉన్నా కేవలం 7 వన్డేలు మాత్రమే ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ సాయంతో 105 పరుగులు చేశాడు. ఫారూఖీ కుడి చేతి వాటం బ్యాటింగ్‌తో పాటు పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ వ్యవహరించేవాడు.
చదవండి: 'అతడొక గన్ ప్లేయర్.. కచ్చితంగా రిటైన్ చేసుకోవాలి'


