ఢాకా: బంగ్లాదేశ్ టేజ్గావ్ ప్రాంతంలో ఉన్న గ్లోబల్ టీవీ కార్యాలయంలో యువకుల గుంపు వీరంగం సృష్టించింది. మీ హెడ్ ఆఫ్ న్యూస్ నజ్నిన్ మున్నీని వెంటనే తొలగించకపోతే కార్యాలయాన్ని తగలబెడతాం’ అని వారు హెచ్చరించారు.
సుమారు 7–8 మంది యువకులు కార్యాలయానికి వచ్చి, మున్నీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.లేదంటే ప్రోథోమ్ ఆలో, డైలీ స్టార్ కార్యాలయాల మాదిరిగానే మీ కార్యాలయాన్ని కూడా తగలబెడతాం’ అని వారు స్పష్టంగా బెదిరించారు.
ఈ గుంపు తమను యాంటీ-డిస్క్రిమినేషన్ స్టూడెంట్ మూవ్‌మెంట్ సభ్యులమని చెప్పుకున్నప్పటికీ, ఆ సంస్థ అధ్యక్షుడు రిఫాత్ రషీద్ ఈ ఘటనతో తమకు సంబంధం లేదని ప్రకటించారు.
గత వారం ప్రముఖ పత్రికలు ప్రోథోమ్ ఆలో మరియు డైలీ స్టార్ కార్యాలయాలపై దాడులు జరగడం, ఆ తరువాత గ్లోబల్ టీవీపై బెదిరింపులు రావడం మీడియా వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. నజ్నిన్ మున్నీ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేస్తూ.. 7–8 మంది నా కార్యాలయానికి వచ్చి, నేను ఉద్యోగం వదిలిపెట్టకపోతే కార్యాలయాన్ని తగలబెడతామని బెదిరించారు’అని వెల్లడించారు. ఆమె ఈ బెదిరింపులు మీడియాను భయపెట్టే ప్రయత్నంలో భాగమని పేర్కొన్నారు.
ఈ ఘటన బంగ్లాదేశ్‌లో ప్రెస్ ఫ్రీడమ్‌పై ఉన్న ముప్పును మరోసారి బయటపెట్టింది. పత్రికా కార్యాలయాలపై దాడులు, టీవీ ఛానెల్‌లపై బెదిరింపులు జరగడం ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛకు పెద్ద సవాలుగా మారింది. అంతర్జాతీయ వర్గాలు ఈ ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
నజ్నిన్ మున్నీని ఉద్యోగం నుంచి ఊడబీకండి.. లేదంటే తగలబెట్టేస్తాం
Dec 25 2025 2:31 AM | Updated on Dec 25 2025 2:35 AM
Advertisement
Advertisement


