ఐపీఎల్ 2026 మినీ వేలానికి (IPL 2026 Auction) నెల రోజులు సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫ్రాంచైజీలన్నీ వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఆటగాళ్ల రిలీజ్, రిటెన్షన్, ట్రేడింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అన్ని ఫ్రాంచైజీల్లో 77 స్లాట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈ స్లాట్ల భర్తీతో ఫ్రాంచైజీలు తమ బలహీనతలను, లోటుపాట్లను పూడ్చుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీల వద్ద మిగిలి ఉన్న పర్స్ విలువ కీలకమవనుంది. కేకేఆర్ అత్యధిక పర్స్ నిలువతో వేలానికి వెళ్లనుండగా, ముంబై ఇండియన్స్ అత్యల్ప పర్సు విలువతో వేలం బరిలో నిలువనుంది.
ఫ్రాంచైజీల వారీగా బలహీనతలు, లోటుపాట్లు..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
పర్స్: ₹43.4 కోట్లు
స్లాట్లు: 9 (విదేశీ 4)
బలహీనతలు:
- జడేజా RRకి వెళ్లడం, ధోనిలో ఫినిషింగ్ సామర్థ్యం తగ్గడంతో లోయర్ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తుంది.
- పతిరణ విడుదలతో పేస్ విభాగం కూడా బలహీనంగా మారింది.
- అశ్విన్ రిటైర్మెంట్, జడేజా ఆర్‌ఆర్‌కు వెళ్లడంతో స్పిన్ విభాగంలో ఖాళీలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఢిల్లీ క్యాపిటల్స్ (DC)
పర్స్: ₹21.8 కోట్లు
స్లాట్లు: 8 (విదేశీ 4)
బలహీనతలు:
- అనుభవజ్ఞుడైన టాపార్డర్ బ్యాటర్ లేడు.
- డుప్లెసిస్, జేక్ ఫ్రేసర్ విడుదల.
- పోరెల్, విప్రాజ్, అశోతోష్, రిజ్వి లాంటి యువ ఆటగాళ్లు ఉన్నా, వారిపై మాత్రమే ఆధారపడలేని పరిస్థితి.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)
పర్స్: 64.3 కోట్లు
స్లాట్లు: 13 (విదేశీ 6)
బలహీనతలు:
- ఓపెనింగ్ జంట లేకపోవడం (గుర్బజ్, డికాక్ విడుదల).
- కెప్టెన్సీ కోసం సరైన ఆటగాడు అవసరం.
- పేస్ విభాగంలో సంక్షోభం (నోర్జే, రస్సెల్ లేకపోవడం).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
పర్స్: ₹16.4 కోట్లు
స్లాట్లు: 8 (విదేశీ 2)
బలహీనతలు:
- హాజిల్‌వుడ్, భువనేశ్వర్‌కు బ్యాకప్ సీమర్ లేడు.
- గాయాలతో సతమతమవుతున్న హాజిల్‌వుడ్ అందుబాటులో ఉండటంపై స్పష్టత ఉండదు.
- భువనేశ్వర్ వయసు పెరుగుతుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)
పర్స్: ₹25.5 కోట్లు
స్లాట్లు: 10 (విదేశీ 2)
బలహీనతలు:
- లోయర్ మిడిలార్డర్ బలహీనంగా ఉంది. సరైన ఫినిషర్ లేడు.
- స్పిన్ విభాగంలో అనుభవజ్ఞులు లేరు (చాహర్, జంపా విడుదల).
లక్నో సూపర్ జెయింట్స్ (LSG)
పర్స్: ₹22.95 కోట్లు
స్లాట్లు: 7 (విదేశీ 4)
బలహీనతలు:
- లోయర్ మిడిలార్డర్‌లో నమ్మదగిన బ్యాటర్ లేడు.
- బౌలింగ్ విభాగం బలహీనం (బిష్ణోయి, ఆకాష్ దీప్ విడుదల).
గుజరాత్ టైటాన్స్ (GT)
పర్స్: ₹12.9 కోట్లు
స్లాట్లు: 6 (విదేశీ 5)
బలహీనతలు:
- మిడిలార్డర్ బలహీనం.
- రూథర్‌ఫోర్డ్ విడుదల, తెవాటియా, సుందర్ పెద్దగా ప్రభావం చూపకపోవడం.
పంజాబ్ కింగ్స్ (PBKS)
పర్స్: ₹11.5 కోట్లు
స్లాట్లు: 4 (విదేశీ 2)
బలహీనతలు:
- మ్యాక్స్‌వెల్, ఇంగ్లిస్ స్థానాల్లో ఆ స్థాయి విధ్వంసకర ఆటగాళ్లు అవసరం.
- వీరు లేకపోవడంతో మిడిలార్డర్ బలహీనం.
రాజస్థాన్ రాయల్స్ (RR)
పర్స్: ₹16.05 కోట్లు
స్లాట్లు: 9 (విదేశీ 1)
బలహీనతలు:
- స్పిన్ విభాగం బలహీనం (తీక్షణ, హసరంగ విడుదల).
- ఒక్క విదేశీ స్లాట్ మాత్రమే మిగిలి ఉండటం.
ముంబై ఇండియన్స్ (MI)
పర్స్: ₹2.75 కోట్లు
స్లాట్లు: 5 (విదేశీ 1)
బలహీనతలు:
- అన్ని విభాగాలు బలంగా ఉన్నప్పటికీ, మిడిలార్డర్‌లో విధ్వంసకర బ్యాటర్ అవసరం.
- ఒక్క విదేశీ స్లాటే ఉండటం.


