భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ వార్త. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో గాయపడ్డ టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఆరోగ్య పరిస్థితి సీరియస్‌గా మారింది. ఆ మ్యాచ్‌లో అలెక్స్ క్యారీ క్యాచ్ అందుకునే క్రమంలో శ్రేయస్ ఎడమ వైపు రిబ్ కేజ్‌పై పడిపోయాడు.
మొదట్లో స్వల్ప నొప్పిగా కనిపించినా, డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిన తర్వాత పరిస్థితి విషమంగా మారింది. వెంటనే మెడికల్ టీమ్ ఆయనను ఆసుపత్రికి తరలించింది.
సిడ్నీలోని ఆసుపత్రిలో స్కానింగ్ చేసిన వైద్యులు, శ్రేయస్‌కు అంతర్గత రక్తస్రావం (internal bleeding) ఉందని గుర్తించారు. వెంటనే ఐసీయూకు తరలించి, రెండు రోజులుగా పర్యవేక్షణలో ఉంచారు. రక్తస్రావం ఆగే వేగం, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఆధారంగా శ్రేయస్‌ను మరో రెండు నుంచి ఏడు రోజులు ఐసీయూలో ఉంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా స్పందించారు.
శ్రేయస్‌కు స్ప్లీన్‌లో లాసరేషన్ గాయం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుతం శ్రేయస్ అరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నాడని తెలిపారు. బీసీసీఐ మెడికల్ టీమ్.. సిడ్నీ, భారత్‌లో ఉన్న వైద్యులను సమన్వయం చేసుకుంటూ శ్రేయస్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత డాక్టర్ శ్రేయస్‌తో పాటే ఉండి రోజువారీగా అతని ఆరోగ్యాన్ని పరిశీలిస్తారని తెలిపారు.
30 ఏళ్ల శ్రేయస్, ఇటీవలే టెస్ట్ క్రికెట్‌కు విరామం తీసుకుని వన్డేలపై ఫోకస్ పెంచనున్నట్లు ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో (11) నిరాశపరిచిన శ్రేయస్.. రెండో వన్డేలో పుంజుకొని 61 పరుగులు చేశాడు. శ్రేయస్ మరో 83 పరుగులు చేస్తే.. వన్డేల్లో 3000 పరుగుల మైలురాయిని తాకుతాడు.
తాజాగా గాయం కారణంగా శ్రేయస్ త్వరలో (నవంబర్ 30) స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌లో ఆడటం అనుమానంగా మారింది. శ్రేయస్ త్వరగా కోలుకోవాలని భారత క్రికెట్ అభిమానులు దేవుళ్లను ప్రార్దిస్తున్నారు. ఇటీవలికాలంలో శ్రేయస్ టీమిండియాకు ప్రధానాస్త్రంగా ఉన్నాడు.
వన్డేల్లో నాలుగో స్థానంలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ తురుపుముక్కగా మారాడు. సౌతాఫ్రికాతో సిరీస్‌కు శ్రేయస్ దూరమైతే టీమిండియా విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది.
చదవండి: భారత్‌తో తొలి టీ20.. ఆస్ట్రేలియా జట్టులో కీలక మార్పు


