ఊచకోత.. సిక్సర్ల సునామీ.. చరిత్రలో అత్యధిక స్కోర్‌ | Jordan Cox Played Blasting Innings In A Match Against Welsh Fire In The Hundred League | Sakshi
Sakshi News home page

ఊచకోత.. సిక్సర్ల సునామీ.. చరిత్రలో అత్యధిక స్కోర్‌

Aug 17 2025 8:26 AM | Updated on Aug 17 2025 9:40 AM

Jordan Cox Played Blasting Innings In A Match Against Welsh Fire In The Hundred League

పురుషుల హండ్రెడ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ నమోదైంది. నిన్న (ఆగస్ట్‌ 16) వెల్ష్‌ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఓవల్‌ ఇన్విన్సిబుల్స్‌ ఈ ఘనత సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇన్విన్సిబుల్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 226 పరుగుల రికార్డు స్కోర్‌ చేసింది.

ఇన్విన్సిబుల్స్‌ చారిత్రక స్కోర్‌ సాధించడానికి జోర్డన్‌ కాక్స్‌ ‍ప్రధాన కారకుడు. కాక్స్‌ 29 బంతుల్లో 10 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో అజేయమైన 86 పరుగులు సాధించాడు. అజీత్‌ డేల్‌ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 4 సిక్సర్లు బాదాడు. 

ఇన్విన్సిబుల్స్‌ ఇన్నింగ్స్‌లో విల్‌ జాక్స్‌ (38), ముయేయే (33), సామ్‌ కర్రన్‌ (34), డొనోవన్‌ ఫెరియెరా (18) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫలితంగా ఇన్విన్సిబుల్స్‌ లీగ్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్‌ నమోదు చేసింది. గతంలోనూ ఈ రికార్డు ఇన్విన్సిబుల్స్‌ (208) పేరిటే ఉండేది. తాజాగా ఇన్విన్సిబుల్స్‌ తమ రికార్డును తామే బద్దలు కొట్టుకుంది. 

రికార్డు స్కోర్‌ చేసిన అనంతరం ఇన్విన్సిబుల్స్‌ లక్ష్యాన్ని సునాయాసంగా కాపాడుకుంది. టామ్‌ కర్రన్‌ (18-8-15-4), బెహ్రెన్‌డార్ఫ్‌ (15-7-20-3) చెలరేగి బౌలింగ్‌ చేసి వెల్ష్‌ ఫైర్‌ను 93 బంతుల్లో 143 పరుగులకే ఆలౌట్‌ చేశారు. జానీ బెయిర్‌స్టో (28 బంతుల్లో 50; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు హాఫ్‌ సెంచరీతో చెలరేగినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. లూక్‌ వెల్స్‌ (29), టామ్‌ కొహ్లెర్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement