రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో బంగ్లాదేశ్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. రెండో రోజు మూడో సెషన్ సమయానికి వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. ఓపెనర్ మహ్ముదుల్ హసన్ జాయ్ (Mahmudul Hasan joy) సెంచరీతో (125 నాటౌట్) కదంతొక్కి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు.
మరో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (80) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. హసన్ జాయ్‌కు జతగా మొమినుల్ హాక్ (38) క్రీజ్‌లో ఉన్నాడు. షద్మాన్ వికెట్ మాథ్యూ హంఫ్రేస్‌కు దక్కింది.
అంతకుముందు ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌటైంది. వెటరన్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (60), కేడ్ కార్మిచల్ (59) అర్ద సెంచరీలతో రాణించారు. కర్టిస్ క్యాంఫర్ (44), లోర్కాన్ టకర్ (41), జోర్డన్ నీల్ (30), బ్యారీ మెక్‌కార్తీ (31) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు.
బంగ్లా బౌలర్లలో మెహిది హసన్ మిరాజ్ 3, హసన్ మహమూద్, తైజుల్ ఇస్లాం, హసన్ మురద్ తలో 2, నహిద్ రాణా ఓ వికెట్ తీసి ఐర్లాండ్‌ను దెబ్బ కొట్టారు. బంగ్లాదేశ్ ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు దాటి 40 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
రెండు టెస్ట్‌లు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న తొలి టెస్ట్ సిల్హెట్ వేదికగా నవంబర్ 11న మొదలు కాగా.. రెండో టెస్ట్ ఢాకా వేదికగా నవంబర్ 19 నుంచి జరుగుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 27, 29, డిసెంబర్ 2 తేదీల్లో మూడు టీ20లు జరుగుతాయి. తొలి రెండు మ్యాచ్‌లకు చట్టోగ్రామ్, మూడో టీ20కి ఢాకా ఆతిథ్యమివ్వనున్నాయి.
చదవండి: IND vs SA: భారత తుది జట్టులో ఇద్దరు వికెట్ కీపర్లు.. క్లారిటీ ఇచ్చిన కోచ్


