భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టు ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం (నవంబర్ 14) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టు ఎంపిక టీమ్ మెనెజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ముఖ్యంగా వికెట్ కీపర్ల విషయంలో ఎవరిని సెలక్ట్ చేయాలని గంభీర్ అండ్ కో తర్జనభర్జన పడుతున్నారు.
ఎందుకంటే ఇంగ్లండ్ పర్యటనలో గాయపడ్డ రెగ్యూలర్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తిరిగి జట్టులోకి వచ్చాడు. మరోవైపు పంత్ బ్యాకప్‌గా ఉన్న ధ్రువ్ జురెల్ సైతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వెస్టిండీస్ సిరీస్‌తో పాటు రంజీ ట్రోఫీలోనూ జురెల్ సెంచరీలతో సత్తాచాటాడు.
దీంతో అతడికి తుది జట్టులో చోటు ఇవ్వాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. ఈ క్రమంలో హెడ్ కోచ్ గంభీర్ కూడా ఇద్దరూ స్పెషలిస్టు వికెట్ కీపర్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తాజాగా భారత అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డెష్కాట్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరు వికెట్ కీపర్లను తుది జట్టులో ఉంచడం కష్టమైనప్పటికీ, ఈ సమస్యకు పరిష్కరం తమ వద్ద ఉందని డెష్కాట్ తెలిపాడు.
"కోల్‌కతా టెస్టు నుంచి ధ్రువ్ జురెల్‌ను మేము దూరంగా ఉంచలేము. కానీ ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేయడం మెనెజ్‌మెంట్‌కు ఎల్లప్పుడూ బిగ్ ఛాలెంజ్‌నే. ఒకరికు ఛాన్స్ ఇవ్వాలంటే మరొకరు తప్పక తప్పుకోవాలి. అయితే తుది జట్టును ఎలా ఎంపిక చేయాలన్న విషయంపై మాకు ఒక క్లారిటీ ఉంది.
ధ్రువ్ ఫామ్ గురుంచి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరులో జరిగిన రంజీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలోనూ సెంచరీలు సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతడు ఆడడం దాదాపు ఖాయమని ర్యాన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు.


