
టీ20 బ్లాస్ట్ 2025 విజేతగా సోమర్‌సెట్ ఆవిర్భవించింది. నిన్న (సెప్టెంబర్ 13) జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్.. టాబీ ఆల్బర్ట్, కెప్టెన్ జేమ్స్ విన్స్ చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
టీ20 బ్లాస్ట్ ఫైనల్స్ చరిత్రలో ఇది రెండో భారీ స్కోర్. అయినా ఈ స్కోర్‌ను హ్యాంప్‌షైర్ కాపాడుకోలేకపోయింది. విల్ స్మీడ్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి సోమర్‌సెట్‌ను గెలిపించాడు. కెప్టెన్ లెవిస్ గ్రెగరి మరో ఓవర్ మిగిలుండగానే సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్.
పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హ్యాంప్‌షైర్.. టాబీ ఆల్బర్ట్ (48 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), జేమ్స్ విన్స్ (34 బంతుల్లో 52; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో భారీ స్కోర్ చేసింది. ఆఖర్లో బెన్నీ హోవెల్ (19 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్సర్లు) వేగంగా పరుగులు రాబట్టాడు.
క్రిస్ లిన్ 12, జేమ్స్ ఫుల్లర్ 1, బెన్ మేయర్స్ 9, అలీ ఒర్ 3 పరుగులు చేశారు. సోమర్‌సెట్ బౌలర్లలో జేక్ బాల్ 2, గ్రెగరి, ఓవర్టన్, గోల్డ్స్‌వర్తీ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సోమర్‌సెట్.. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించడంతో 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది (4 వికెట్లు కోల్పోయి).
సీన్ డిక్సన్ (22 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), గ్రెగరి (5 బంతుల్లో 18 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) సోమర్‌సెట్‌ను విజయతీరాలకు చేర్చారు. మిగతా బ్యాటర్లలో టామ్ కొహ్లెర్ కాడ్‌మోర్ 23, టామ్ ఏబెల్ 0, జేమ్స్ రూ 20 పరుగులు చేశారు.
హ్యాంప్‌షైర్ బౌలరల్లో స్కాట్ కర్రీ 2, సొన్నీ బేకర్, జేమ్స్ ఫుల్లర్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం. ఈ మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌కు గానూ స్మీడ్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్దు దక్కింది.