breaking news
RTC buses collisioned
-
తమిళనాడులో ఘోర ప్రమాదం.. 12 మంది మృతి
శివగంగ జిల్లా: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. శివగంగ జిల్లా తిరుపత్తూర్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించారు. ఓ బస్సు తిరుప్పూర్ నుంచి కారైకుడికి వెళ్తుండగా.. మరో బస్సు కారైకుడి నుంచి దిండిగల్‌కు వస్తుండగా ప్రమాదం జరిగింది.గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఫైర్ సిబ్బంది, అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
-
ఆర్టీసీ బస్సులు ఢీ.. పదిమందికి గాయాలు
నార్కెట్‌పల్లి(నల్లగొండ): వేగంగా వెళ్తున్న బస్సు రోడ్డు జంక్షన్ దాటుతున్న ఎక్స్‌ప్రెస్ బస్సును ఢీకొన్న ప్రమాదంలో పదిమందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగింది. వివరాలు.. మణుగూరు డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు మణుగూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది. నార్కెట్ పల్లి శివారులోని కామెనేని ఆస్పత్రి ఎదురుగా ఉన్న వై జంక్షన్ వద్ద నార్కెట్‌పల్లి పట్టణంలోనికి ప్రవేశిస్తుండగా.. హైదరాబాద్ నుంచి నర్సరావుపేట వెళ్తున్న ఇంద్ర బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది. దీంతో బస్సులో ఉన్న పదిమంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. తోటి ప్రయాణికులు క్షతగాత్రులను వెంటనే స్థానిక కామినేని ఆస్పత్రికి తరలించారు.


