అది సరికాదు.. కేంద్రంపై మరోసారి సీఎం స్టాలిన్‌ ఫైర్‌ | Not Fair To Turn Deaf Ear To Demands Needs Of Tamil Nad: MK Stalin | Sakshi
Sakshi News home page

అది సరికాదు.. కేంద్రంపై మరోసారి సీఎం స్టాలిన్‌ ఫైర్‌

Nov 29 2025 4:49 PM | Updated on Nov 29 2025 5:03 PM

Not Fair To Turn Deaf Ear To Demands Needs Of Tamil Nad: MK Stalin

చెన్నై: కేంద్రంపై మరోసారి తమిళనాడు సీఎం స్టాలిన్‌ విరుచుకుపడ్డారు. తమిళనాడును కేంద్రం మోసం చేస్తోందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. తమిళనాడు నుంచి కేంద్రానికి ఎక్కువ రెవెన్యూ వెళ్తోందని.. కేంద్రం నుంచి మాత్రం తమిళనాడుకు తక్కువ నిధులొస్తున్నాయంటూ కేంద్రాన్ని స్టాలిన్‌ నిలదీశారు. రాష్ట్రానికి సంబంధించిన న్యాయమైన డిమాండ్లను కేంద్రం ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తుందని దుయ్యబట్టారు.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా చెప్పుకుంటూ, తమిళనాడు ప్రజల గొంతును బీజేపీ ప్రభుత్వం విస్మరించడం సరైనదేనా? అంటూ స్టాలిన్‌ ట్వీట్‌ చేశారు. తమిళనాడు డిమాండ్లు, అవసరాలను లేఖలు, వ్యక్తిగత పిటిషన్లు, శాసనసభ తీర్మానాల ద్వారా తీసుకొని వాటిని వినకపోవడం న్యాయం కాదు. అత్యధిక పన్ను ఆదాయాన్ని ఉత్పత్తి చేసే రాష్ట్రమైన తమిళనాడును మోసం చేయడాన్ని మనస్సాక్షి ఉన్న ఎవరూ అంగీకరించరు. మేము తలవంచం. నిటారుగా నడుస్తాం. రాబోయే పార్లమెంటరీ సమావేశంలో బీజేపీ ప్రభుత్వం.. తమిళనాడు ప్రజా ప్రతినిధులకు సమాధానం చెప్పాలి’’ అంటూ స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు.
 

Advertisement
 
Advertisement
Advertisement