'దిత్వా' తుపాను ఎఫెక్ట్‌.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ | ditva toofan occurred in andhra pradesh | Sakshi
Sakshi News home page

'దిత్వా' తుపాను ఎఫెక్ట్‌.. ఈ జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌

Nov 29 2025 10:25 PM | Updated on Nov 30 2025 11:46 AM

ditva toofan occurred in andhra pradesh

దిత్వా తుపాను ఏపీ వైపు దూసుకొస్తుంది. నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరంలో ఏర్పడిన ‘దిత్వా’ తుపాను పుదుచ్చేరికి 280 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. చెన్నైకి 380 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది. దీంతో దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు పడుతున్నాయి. ఉత్తర దిశగా కదులుతున్న తుపాను రాత్రికి చెన్నై, రేపు పుదుచ్చేరి తీరాన్ని తాకనుంది. దీంతో ఏపీలోని పలు జిల్లాలకు కూడా దిత్వా తుపాను ముప్పు ఉంది. 

దక్షిణ కోస్తా , రాయలసీమ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించారు. రేపు ప్రకాశం, అన్నమయ్య, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ ప్రకటించనున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లోని అన్ని పోర్టుల్లో 2వ నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50 కి.మీల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement