
టీవీకే అధినేత విజయ్ శనివారం సాయంత్రం కరూర్‌లో నిర్వహించిన ర్యాలీ తీవ్ర విషాదం నింపింది. తొక్కిసలాటలో 39 మంది మరణించగా.. వంద మంది దాకా ఆస్పత్రి పాలయ్యారు. వీళ్లలో 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.

బాధిత కుటుంబాల రోదనలతో ఆస్పత్రుల ప్రాంగణాలు మారుమోగుతున్నాయి. మృతుల్లో చిన్నారులూ ఉండడం పలువురిని కంటతడి పెట్టిస్తోంది.

రాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు సీఎం స్టాలిన్.

ఘటనపై జ్యూడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు.

గుండె బద్ధలైందని.. గాయపడ్డవాళ్లు త్వరగా కోలుకోవాలని విజయ్ ఆకాంక్షించారు.

మరోవైపు.. ఘటనకు కారకుడైన విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ డిమాండ్లు వెల్లువెత్తుతుండగా.. ప్రభుత్వ, పోలీసు యంత్రాంగాల వల్లే ఈ ఘోరం జరిగిందని టీవీకే కౌంటర్ ఇస్తోంది.





