విజయ్‌ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి | Vijays Karur rally: Unfortunate incident, deeply saddening says PM Modi | Sakshi
Sakshi News home page

విజయ్‌ సభలో తొక్కిసలాట ఘటన.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

Sep 27 2025 9:56 PM | Updated on Sep 27 2025 10:00 PM

Vijays Karur rally: Unfortunate incident, deeply saddening says PM Modi

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు, టీవీకే అధినేత విజయ్‌ ప్రచార సభలో జరిగిన తొక్కిసలాటలో భారీ ప్రాణనష్టం వాటిల్లడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటనగా  పేర్కొన్న మోదీ.. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మోదీ భరోసా ఇచ్చారు. 

 

తొక్కిసలాట ఘటనపై సీఎం స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణ సహాయ చర్యలకు సీఎం స్టాలిన్‌ ఆదేశించారు. ఘటనపై కరూర్‌ కలెక్టర్‌తో సీఎం స్టాలిన్‌ మాట్లాడారు. రేపు బాధిత కుటుంబాలను స్టాలిన్‌ పరామర్శించనున్నారు. 

కాగా,  విజయ్‌ ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 30 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. 50 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కరూర్‌ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు. 

విజయ్‌ సభలో తీవ్ర తోపులాట చోటుచేసుకోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. కరూర్‌లో నిర్వహించిన విజయ్‌ ప్రచార సభకు భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. దీంతో ఆయన ప్రసంగిస్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. ప్రమాదాన్ని గమనించిన విజయ్‌ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు.  10వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్న విజయ్‌ సభకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement