ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌట్
107 పరుగుల ఆధిక్యంలో తమిళనాడు
సాక్షి, విశాఖపట్నం: తొలి రోజు తమిళనాడును తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన ఆంధ్ర జట్టు రెండో రోజు బ్యాటింగ్‌లో తడబడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని నెలకొల్పాల్సిన చోట అనూహ్యంగా వెనుకబడింది. రంజీ ట్రోఫీ గ్రూప్ ‘ఎ’లో తమిళనాడుతో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 20/1తో ఆదివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆంధ్ర 49 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది.
ఫలితంగా తమిళనాడుకు 5 పరుగుల అతి స్వల్ప ఆధిక్యం లభించింది. ఆట మొదటి బంతికే అభిషేక్ (3)ను అవుట్ చేసిన సందీప్ వారియర్ ఆ తర్వాత కూడా ఆంధ్రను వణికించాడు. స్వల్ప వ్యవధిలో మరో ఓవర్‌నైట్ బ్యాటర్ త్రిపురణ విజయ్ (3)ని త్రిలోక్ నాగ్ క్లీన్»ౌల్డ్ చేశాడు. అలా జట్టు స్కోరు 30 పరుగులకు ముందే టాపార్డర్ వికెట్లను కోల్పోయింది. సందీప్ వారియర్ ధాటికి కెప్టెన్ రికీ భుయ్ (4), సోను యాదవ్ పేస్‌కు కరణ్ షిండే (9) నిలువలేకపోయారు.
ఇలాంటి తరుణంలో 63 పరుగులకే సగం (5) వికెట్లను కోల్పోయిన ఆంధ్రను షేక్ రషీద్ (150 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. కానీ అవతలి వైపు అశ్విన్ (13), రాజు (1), పృథ్వీరాజ్ (0), సాయితేజ (2)ల నుంచి సహకారం లభించలేదు. ఒక్క సౌరభ్ కుమార్ (30; 3 ఫోర్లు) అండతోనే రషీద్ ఆమాత్రం స్కోరును చేసి పెట్టాడు. సందీప్ 4, త్రిలోక్ నాగ్, సోను యాదవ్, సాయికిషోర్ తలా 2 వికెట్లు తీశారు.
తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తమిళనాడు ఆట ముగిసే సమయానికి 29 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 102 పరుగులు చేసింది. ఓపెనర్లు విమల్ (20), జగదీశన్ (0)లను ఆంధ్ర»ౌలర్లు కట్టడి చేయగా... బాలసుబ్రహ్మణ్యం సచిన్ (51; 8 ఫోర్లు) రాణించాడు. ప్రదోశ్ రంజన్ (26 బ్యాటింగ్; 3 ఫోర్లు), సాయి కిషోర్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. పృథీ్వరాజ్, రాజు చెరో వికెట్ తీశారు. ప్రస్తుతం తమిళనాడు 107 పరుగుల ఆధిక్యంలో ఉంది.


