తమిళనాడు: కులాంతర వివాహం చేసుకున్నాడనే నెపంతో నాలుగేళ్లుగా గ్రామానికి రానివ్వకుండా బహిష్కరించి, వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ బాధితుడు సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. తిరువళ్లూరు జిల్లా గుమ్మిడిపూండి తాలూకా ఓబులాపురం గ్రామానికి చెందిన ప్రేమ్(27). ఇతను ఎంబీసీ కులానికి చెందిన వ్యక్తి. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన మత్స్యకార కుటుంబానికి చెందిన భానుమతి(24)ని ప్రేమించి నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.
దీంతో గ్రామ పెద్దలు ప్రేమ్‌తోపాటు అతడి కుటుంబ సభ్యులను గ్రామ బహిష్కరణ చేసినట్టు తెలుస్తుంది. దీంతోపాటు గ్రామంలోకి ప్రవేశించకూడదని, ఆలయంలోని గుడికి రాకూడదు, గ్రామంలో వెళ్లకూడదు, శుభ కార్యంలో పాల్గొన కూడదని నిబంధన విధించారు. దీంతో పాటు గత రెండు రోజుల క్రితం తన ఇంటిని సైతం ధ్వంసం చేశారని, ఇదే విషయంపై ఆరంబాక్కం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వివరించాడు. తమను గ్రామ బహిష్కరణ చేసి చిత్రహింసలకు గురి చేస్తున్న వారిపై చర్యలు తీసుకోడంతోపాటు తమకు భద్రత కలి్పంచాలని కోరుతూ బాధితుడు తల్లిదండ్రులు, భార్యతో కలిసి ఆందోళన నిర్వహించాడు.


