
చెన్నై: తమిళనాడులో(tamil Nadu) కరూర్(karur Incident) ఘటన తీవ్ర విషాదం నింపింది. అయితే, ఈ ఘటన అనంతరం.. టీవీకే చీఫ్, నటుడు విజయ్‌కి(Vijay) బాంబు బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. దీంతో, అప్రమత్తమైన పోలీసులు.. అర్ధరాత్రి హుటాహుటినా విజయ్ ఇంటి వద్ద తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. తమిళగ వెట్రి కజగం (టీవీకే)Tamilaga Vettri Kazhagam (TVK) చీఫ్, నటుడు విజయ్ నివాసం నీలంకరైలోని ఈసీఆర్ వద్ద బాంబు అమర్చినట్లు చెన్నై పోలీసులకు సోమవారం తెల్లవారుజామున ఫోన్ కాల్ వచ్చింది. దీంతో, అలర్ట్ అయిన పోలీసులు.. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బందితో విజయ్ నివాసం వద్ద తనిఖీలు చేపట్టారు. ఇళ్లంతా ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. అనంతరం, బాంబు లేదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. విజయ్ ఇంటి వద్ద పోలీసులు తనిఖీ చేస్తున్న వీడియోలు బయటకు వచ్చాయి.
Tamil Nadu | Chennai police received a phone call earlier today claiming that a bomb had been planted at the ECR, Neelankarai residence of Tamilaga Vettri Kazhagam (TVK) Chief and actor Vijay. Following the alert, police personnel rushed to the actor’s residence, and a bomb… pic.twitter.com/Fs7xceZWlI
— ANI (@ANI) September 28, 2025
ఇదిలా ఉండగా.. కరూర్ ఘటన నేపథ్యంలో విజయ్ నివాసం ఉన్న పనయూరు పరిసరాలలో కొన్ని సంఘాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు ఆదివారం దిగాయి. దీంతో వీరిని పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో విజయ్ నివాసం, తమిళగ వెట్రి కళగం పార్టీ కార్యాలయం పరిసరాలలో భద్రతను పెంచారు. విజయ్ నివాసం వద్ద కేంద్ర సీఆర్‌పీఎఫ్ బలగాలు మోహరించాయి.
ఇక, కరూర్ ఘటనతో తీవ్ర మనోవేదనలో ఉన్న విజయ్ తన ఆవేదనను ట్విట్టర్ వేదికగా తెలియజేశారు. మృతుల కుటుంబాలకు ప్రతీ ఒక్కరికీ రూ.20 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డ వారికి రూ.2లక్షలు అందజేయనున్నట్టు తెలిపారు. అలాగే, తన హృదయం ముక్కలైందని, కన్నీటి వేదనలో ఉన్నానని పేర్కొంటూ, అందరినీ కలవాలని ఉన్నా, అనుమతి కోసం ఎదురు చూడాల్సి ఉందని ఉద్వేగంతో ప్రకటన విడుదల చేశారు.