
చెన్నై: దసరా పండుగ పూట తమిళనాడులో(Tamil nadu) విషాదకర ఘటన చోటుచేసుకుంది. తమిళనాడులో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road Accident) ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు ీతీవ్రంగా గాయపడటంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు.
వివరాల ప్రకారం.. పండుగ సందర్భంగా ఐదుగురు యువకులు చెన్నై(Chennai) నుంచి మున్నార్‌కు ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో వారంతా ఓ కారులో గురువారం తెల్లవారుజామున ట్రిప్‌కు బయలుదేరారు. కారు విల్లుపురం వద్దకు రాగానే విక్రవాండి దగ్గర అదుపు తప్పి బోల్తా కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో మంటలు చెలరేగాయి. దీంతో, కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం సమయంలో కారు నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో రహదారిపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు.