ఏసీబీ సీఐ కారును ఢీకొట్టిన లారీ
–స్వల్పగాయాలతో బయటపడ్డ సీఐ
తిరువళ్లూరు: కారును లారీ ఢీకొన్న ఘటనలో ఏసీబీ సీఐ గాయపడ్డారు. తిరువళ్లూరు ఏసీబీ సీఐగా తమిళరసి విధులు నిర్వహిస్తున్నారు. ఈమె కార్యాలయ పనుల నిమిత్తం మద్రాసు హైకోర్టుకు శుక్రవారం ఉదయం కారులో బయలుదేరారు. తిరుపతి–చైన్నె జాతీయ రహదారిలోని తిరువళ్లూరు మున్సిపాలిటీ కార్యాలయం వద్ద కారు వెళుతున్న సమయంలో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పాక్షికంగా దెబ్బతింది. సీఐ తమిళరసి స్వల్పంగా గాయపడి ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకుని సంఘటన స్థలానికి వెళ్లిన తిరువళ్లూరు టౌన్ పోలీసులు కేసు దర్యాప్తును చేశారు. లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని ప్రత్యేకంగా విచారణ జరిపారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపిన క్రమంలో ప్రమాధం వెనుక కుట్ర ఉందా అనే కోణంలో దర్యాప్తును ముమ్మరం చేశారు. గాయపడ్డ సీఐని తిరువళ్లూరులో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం చైన్నెకి తరలించారు.


