సవాళ్లను అధిగమిస్తే ఉజ్వల భవిష్యత్తు
సాక్షి, చైన్నె: అపజయాలకు కృంగి పోవద్దని, సవాళ్లను అధిగమించి విజయం వైపుగా అడుగులు వేసి భవిష్యత్తును ఉజ్వలమయం చేసుకోవాలని విద్యార్థులకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ సూచించారు. చైన్నె మదుర వాయిల్‌లోని డాక్టర్ ఎంజీఆర్ విద్య, పరిశోధన సంస్థ 34వ స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. ఇందులో 5,087 మంది విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేశారు. కోర్సుల్లో రాణించిన వారికి పతకాలను ఉప రాష్ట్రపతి అందజేశారు. విద్యా సంస్థ చాన్స్‌లర్ డాక్టర్ ఏసీ షణ్ముగం, అధ్యక్షుడు ఏసీఎస్ అరుణ్‌కుమార్ స్నాతకోత్సవానికి అధ్యక్షత వహించారు. గ్రాడ్యుయేట్లతోపాటు ముఖ్యులను సత్కరించారు. రాష్ట్ర ఆరోగ్యశాఖా మంత్రి ఎం సుబ్రమణియన్, విద్యా సంస్థ కార్యదర్శి ఎ.రవికుమార్, వైస్ చాన్స్‌లర్ ఎస్ గీతాలక్ష్మి, ఉపాధ్యక్షుడు ఎంకే పద్మనాభన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ జీసీ కోదండన్, ప్రొ.వైస్ చాన్స్‌లర్లు ఎం రవిచంద్రన్, సీఎస్ జయచంద్రన్, డైరెక్టర్ విశ్వనాథన్, డైరెక్టర్ ఎన్.వాసుదేవన్, స్పెల్ ఆఫీసర్ ఏ.జ్ఞానశేఖర్ పాల్గొన్నారు.
సవాళ్లను అధిగమిస్తే ఉజ్వల భవిష్యత్తు


